Begin typing your search above and press return to search.

రాజమౌళి, సుకుమార్ మధ్య తేడాలు?

ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ మొదటి సినిమా నుంచి వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు.

By:  Gopi Velupala   |   15 Oct 2026 12:34 PM IST
రాజమౌళి, సుకుమార్ మధ్య తేడాలు?
X

'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాజమౌళి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తనకు ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి సినిమాలన్నీ అతనికి మాస్ డైరెక్టర్ ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టాయి... మగధీర సినిమాతో విజువల్ వండర్ ని తెరమీద ఆవిష్కరించిన రాజమౌళిని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. 'ఈగ' సినిమాతో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించిన ఘనత కూడా తనకే దక్కింది... 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల అటెన్షన్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే హాలీవుడ్ దర్శకుల పక్కన తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు...

సుకుమార్

ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్ మొదటి సినిమా నుంచి వైవిధ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా తన సినిమాలో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం నెగెటివ్ టచ్ ఇచ్చినప్పటికీ హీరోని ఎలివేట్ చేస్తూ స్క్రీన్ ప్లే ని రాసుకుంటాడు. మొత్తానికైతే సుకుమార్ సినిమాల్లో హీరో ఇతర దర్శకుల సినిమాల కంటే చాలా భిన్నంగా కనిపిస్తాడు... 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించిన సుకుమార్ మాస్ సినిమాలను సైతం సక్సెస్ ఫుల్ గా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్నాడు. 'రంగస్థలం ' సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన పద్ధతి అందరినీ ఆకట్టుకుంది. చిట్టి బాబు పాత్రకి రాసుకున్న సన్నివేశాలు, ఆ క్యారెక్టర్ లో సుకుమార్ చూపించిన డెప్త్ అందరిని ఆకట్టుకుంది.

రాజమౌళి - సుకుమార్ మధ్య తేడా

రాజమౌళి కథలోని ఎమోషన్స్ కి విజువల్ వండర్ ను ఒక సహనంగా వాడుకుంటూ లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. సినిమా చూసే ప్రేక్షకుడు ఆ గ్రాండీయర్ ను ఫీల్ అవ్వాలని కథలో ఇంటెన్సిటీ మిస్ అవ్వకుండా సహజ పద్ధతిలో సినిమా సన్నివేశాలను రియాల్టీగా ఉండేలా డిజైన్ చేసుకుంటాడు... సినిమాలోని ఎమోషన్ ను హోల్డ్ చేసి పెట్టి ఒక యాక్షన్ ఎపిసోడ్ లో దాన్ని హైలెట్ చేస్తాడు... ఇక సుకుమార్ సినిమాలో గ్రాఫిక్స్ పెద్దగా కనిపించదు. ఆయన హీరో క్యారెక్టరైజేషన్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాడు. దాని మీదనే కథను నడిపిస్తాడు. అలాగే తను రాసే స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల మైండ్ కి పదును పెట్టేలా వాళ్ళు ఆలోచించేలా చేస్తాడు. ఈ విషయాల్లో రాజమౌళి కి సుకుమార్ కి మధ్య తేడాలున్నాయి...ఈ ఇద్దరిలో ఒకరు విజువల్ స్పెక్టకిల్ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంటే, మరొకరు ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్స్ తో గ్లోబల్ వైడ్ మ్యాజిక్ చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచ పటంలో నిలుపడంలో ఈ ఇద్దరి దర్శకుల పాత్ర అమోఘం...