రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...
దర్శకుడు శంకర్ గత కొంతకాలంగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతుండగా, రాజమౌళి వరుస విజయాలతో టాప్‌లో కొనసాగుతున్నారు. రాజమౌళి కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తారని, శంకర్ మాత్రం విజువల్ ప్రెజెంటేషన్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారని విశ్లేషణ. రచయిత సుజాత మరణం తర్వాత శంకర్ కథల్లో బలం తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
By: Gopi Velupala | 13 Nov 2026 12:37 PM ISTసినిమా ఇండస్ట్రీ లో రాణించడం ఈజీ కాదు. ఒకప్పుడు సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకులే ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు...ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవ్వరు టాప్ లో ఉంటారో? ఎవరు పాతాళానికి పడిపోతారో చెప్పడం కష్టం... తమిళ్ టాప్ డైరెక్టర్ శంకర్ కి సక్సెస్ లు కరువయ్యాయి..శంకర్ తో పోటీ పడాలి అనే టార్గెట్ పెట్టుకొని సినిమాలు చేసి సక్సెస్ లను సాధించిన రాజమౌళి ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు. శంకర్ మాత్రం ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలా జరగడానికి కారణం ఏంటి? రాజమౌళి సక్సెస్ కి - శంకర్ ఫెయిల్యూర్ కి కారణాలు ఏంటనేది తెలుసుకుందాం...
శంకర్
'జెంటిల్ మెన్' సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన శంకర్ మొదటి సినిమాతోనే సక్సెస్ ని సాధించాడు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా టెక్నాలజీని వాడుతూ గ్రాఫిక్స్ తో వండర్స్ ని క్రియేట్ చేశాడు. ఒకానొక సందర్భంలో శంకర్ కి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ ఇంకెవరికి లేదు అనేంతలా పేరు ప్రఖ్యాతలను మూటగట్టుకున్నాడు... అలాంటి దర్శకుడు ప్రస్తుతం ఒక్క సక్సెస్ ను సాధించడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. గత 10 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక్క సక్సెస్ కూడా లేదంటే ఆయన కెరియర్ ఎంతలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు...
రాజమౌళి
కెరియర్ స్టార్టింగ్ లో కమర్షియల్ సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించిన రాజమౌళి ఆ తర్వాత చేసిన విజువల్ వండర్స్ తో ప్రేక్షకులందర్ని తన వైపు తిప్పుకున్నాడు. తెలుగు సినిమా రేంజ్ ను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో 'వారణాసి' సినిమా చేస్తున్నాడు.
రాజమౌళి - శంకర్ మధ్య వ్యత్యాసం ఏంటంటే...
రాజమౌళి కథ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు. చిన్న ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ గా డెవలప్ చేసే ప్రాసెస్ లో ఎక్కడ కూడా ఆయన ఏ ఒక్క మిస్టేక్ లేకుండా చూసుకుంటాడు. కథ ఏం కావాలనుకుంటుంది క్యారెక్టర్స్ ను ఎలా డిజైన్ చేయాలి. స్క్రీన్ ప్లే లో ఎక్కడ హై మూమెంట్ వస్తే ప్రేక్షకుడు విజిల్ కొడతాడు అనేది బాగా ప్లాన్ చేసుకుంటాడు. దానిని స్క్రీన్ మీద చాలా యంగేజింగ్ గా ప్రజెంట్ చేస్తాడు. అందుకే రాజమౌళి చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధిస్తుంది... శంకర్ మాత్రం ప్రజెంటేషన్ రిచ్ గా ఉండాలని చూస్తున్నాడు తప్ప కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? అందులో కాన్ఫ్లిక్ట్ జన్యున్ గా ఉందా? పాత్రల క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏ పాత్ర ఎలా ఉంటే ప్రేక్షకుడికి నచ్చుతుంది.
ప్రేక్షకుడు సంతృప్తి చెందే విధంగా సినిమా ముగింపు ఉందా? అనే విషయాల గురించి అస్సలు ఆలోచించడం లేదు. 'జెంటిల్ మెన్' మూవీ నుంచి 'రోబో' వరకు 'సుజాత రంగనాథన్' అనే రైటర్ శంకర్ ఐడియాలజీ కి తగ్గట్టుగా కథ రాసి ఇచ్చేవాడు. కాబట్టి స్టోరీలు బాగా వచ్చాయి. కానీ ఆయన మరణించిన తర్వాత శంకర్ రాసే కథల్లో సోల్ మిస్ అవుతుంది. దానివల్లే ఆయనకి వరుస ప్లాప్ లు వస్తున్నాయి...ఒక మంచి కథ దొరికితే శంకర్ మళ్ళీ సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంది.
