Begin typing your search above and press return to search.

జ‌క్క‌న్న'ధురంధ‌ర్'ని ఫాలో అవుతున్నాడా?

థియేట్రిక‌ల్ ర‌న్ విష‌యంలో ప్రేక్ష‌కుల్లో వ‌చ్చిన మార్పుని దృష్టిలో పెట్టుకుని `వార‌ణాసి` చాలా ఎలాబ‌రేట్‌గా పూర్తి స్థాయిలో చెప్పాల‌ని, అందుకు రెండు భాగాలుగా చెప్ప‌డ‌మే క‌రెక్ట్ అని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌.

By:  Ravindar Gorantla   |   28 March 2026 10:00 PM IST
జ‌క్క‌న్నధురంధ‌ర్ని ఫాలో అవుతున్నాడా?
X

వార‌ణాసి.. ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. వ‌రుస పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్‌ల త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో దీనిపై ష‌మ‌జంగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దాన‌కి త‌గ్గ‌ట్టే సినిమాని హాలీవుడ్ స్థాయిలో జ‌క్క‌న్న పోట్రే చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇప్ప‌టికే హాలీవుడ్‌లో ప్ర‌చారం మొద‌లు పెట్టిన రాజ‌మౌళి ఈ మూవీ కోసం `ధురంధ‌ర్‌` ఫార్ములాని ఫాలో అవుతున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ధురంధ‌ర్ మూవీని ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ ముందు వెబ్ సిరీస్‌గా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశాడు.

అయితే స్టోరీపై ఉన్న క్రేజ్‌ని గ‌మ‌నించి అదే సిరీస్ ఫార్మాట్‌లోనే రెండు భాగాలుగా సినిమాని మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చి సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా దేశ వ్యాప్తంగా స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాడు. ఇప్ప‌డు ఇదే ఫార్ములాని రాజ‌మౌళి ఫాలో కావ‌డానికి నిర్ణ‌యించుకున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా, గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ‌హేష్ బాబు రుద్ర‌గా, శ్రీ‌రాముడిగా రెండు పాత్ర‌ల్లో కనిపించి స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నాడు. త్రేతాయుగం, క‌లియుగం, ఆఫ్రికా టు అంటార్కిటికా నేప‌థ్యాల్లో క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. లార్జ‌ర్‌దెన్ లైఫ్ మూవీ..భారీ స్థాయిలో అత్య‌ధిక నిడివితో చెప్పాల్సిన క‌థ కావ‌డంతో మూడున్న‌ర గంట‌ల వ్య‌వ‌ధిలో ఇలాంటి క‌థ‌ని చెప్ప‌డం హైలీ ఇంపాజిబుల్‌. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన రాజ‌మౌళి చెప్పాల‌నుకున్న క‌థ‌ని స‌వివ‌రంగా చెబితే బాగుంటుంద‌ని, ఒక పార్ట్‌గా చెబితే ఎవ‌రికీ అర్థం కాద‌ని దీన్ని `ధురంధ‌ర్‌` త‌రహాలో రెండు భాగాలుగా చెప్పాల‌నే ప్లాన్‌కు జ‌క్క‌న్న రెడీ అవుతున్నార‌ని ఇన్ సైడ్ టాక్‌.

థియేట్రిక‌ల్ ర‌న్ విష‌యంలో ప్రేక్ష‌కుల్లో వ‌చ్చిన మార్పుని దృష్టిలో పెట్టుకుని `వార‌ణాసి` చాలా ఎలాబ‌రేట్‌గా పూర్తి స్థాయిలో చెప్పాల‌ని, అందుకు రెండు భాగాలుగా చెప్ప‌డ‌మే క‌రెక్ట్ అని రాజ‌మౌళి భావిస్తున్నార‌ట‌. అందుకే ప్ర‌స్తుత ప్లాన్‌లో భారీ మార్పులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. పైగా `వార‌ణాసి` స్టోరీ ప్ర‌కారం ఒక్క పార్ట్‌లో చెప్ప‌డం కుద‌ర‌ద‌ని, రెండు భాగాలుగా చెప్పేంత క‌థ ఉంద‌ని, ఆ కార‌ణంగానే జ‌క్క‌న్న త‌న ప్లాన్ మార్చుకుంటున్నార‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే గఇటీవ‌ల రాజమౌళి ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియ‌తో ముచ్చ‌టిస్తూ దీనికి పూర్తి భిన్నంగా స్టేట్మెంట్ ఇవ్వ‌డం తెలిసిందే. రెండు భాగాలుగా చేయ‌డం లేద‌ని, కేవ‌లం ఒక పార్టేన‌ని స్ప‌ష్టం చేశారు. కానీ `ధురంధ‌ర్` ఫ‌లితం త‌రువాత ఆయ‌న ఆలోచ‌న‌లో మార్పులు చోటు చేసుకున్నాయ‌ని, ఆ కార‌ణంగానే దీన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాల‌నే ప్లాన్ చేస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో ఉన్న నిజ‌మెంత అన్న‌ది తెలియాలంటే జ‌క్క‌న్న క్లారిటీ ఇవ్వాల్సిందే.