రాజమౌళి ముందే తొడలు గొడుతున్నారా?
రామాయణం తొలి భాగం వసూళ్లను వారణాసి అంతర్జాతీయ మార్కెట్‌తో పోలుస్తుండటంపై రాజమౌళి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామాయణం నాలుగు రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు సాధించగా, వారణాసిని 120 దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు సినిమాల మార్కెట్‌ను పోల్చడం సరికాదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
By: Srikanth Kontham | 9 Nov 2026 4:00 PM ISTదర్శకశిఖరం రాజమౌళి సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాతోనే ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిన పేరు అది. `ఈగ`, `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలతో ఇండియా సహా వరల్డ్ నే షేక్ చేసిన సంచలనం. ఈ మూడు సినిమాలతోనే 4000 కోట్ల వసూళ్లతో తెలుగు సినిమా సత్తా చాటిన దిగ్గజం. గ్లోబల్ రిలీజ్ `వారణాసి`తో 5000 కోట్ల మార్కెట్ ను టార్గెట్ చేసిన నయా సంచలనం. రాజమౌళి ప్రతిభ చూసి హాలీవుడ్ దిగ్గజాలే ప్రశంసించిన లెజెండ్. బాలీవుడ్ అయితే జక్కన్న పనితీరుకే దాసోహమే అయిపోయింది.
అంతటి లెజెండరీ ముందే తొడలు గొట్టే సైన్యం ఏపాటిది? అదీ సొంత గడ్డపైనే దర్శకశిఖరంపైనే ఎటాకింగా? అంటే `ప్లూటు జింక ముందు ఉదాలి.. సింహం ముందు కాదు` అంటూ నటసింహ బాలయ్య చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకోవాల్సిందే. వివరాల్లోకి వెళ్తే ఇటీవలే నితీష్ తివారీ తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం `రామాయణం` మొదటి భాగం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లేనే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరింది. ఇందులో 300 కోట్ల వసూళ్లు ఒక్క భారత్ నుంచి రాబట్టింది. రిమైనింగ్ వసూళ్లని విదేశాల నుంచి వచ్చినవి.
ఈ నేపథ్యంలో రామాయణం మొదటి భాగం విజయం నుంచి వారణాసికి ఇంటర్నేషనల్ డోర్స్ ఓపెన్ అయ్యాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు రావడం ఆసక్తి కరంగా మారింది. ఈ విషయంలో రామాయణం టీమ్ అంతా సైలెంట్ గానే ఉన్నా? అక్కడి సోషల్ మీడయా సహా ఇతర మీడియా సంస్థలు వారణాసికి `రామాయణం` వసూళ్లే ప్రామాణికం అంటూ కొత్త పల్లవి అందుకుంది. దీంతో రాజమౌళి అభిమాన వర్గమంతా ఆ రెండు సినిమాల మార్కెట్ కి పోలిక ఏంటనే అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. `వారణాసి` చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో రిలీజ్ చేయ డానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగానూ వెల్లడించారు. ఇంతవరకూ ఏ ఇండియన్ సినిమా ఇన్ని దేశాల్లో రిలీజ్ అవ్వలేదు.
అలాంటింది రిలీజ్ పరంగా ఈ రెండు సినిమాలకు పోలిక ఏంటి? రాజమౌళి సినిమాకు రామాయణం ఇంటర్నే షనల్ మార్కెట్ డోర్స్ తెరుచుకోవడం ఏంటి? అంటూ జక్కన్న అభిమానుల్లు నవ్వేస్తున్నారు. హాలీవుడ్ నే టాలీవుడ్ వైపు తొంగి చూసేలా చేసిన లెజెండ్ గురించి తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
