‘వారణాసి’లో లవ్ స్టోరీ హైలైట్.. రాజమౌళి అదిరిపోయే అప్డేట్!
గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
By: Madhu Reddy | 21 Oct 2026 12:00 AM ISTగ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ప్రస్తుతం సినిమా వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా జక్కన్న పంచుకున్న విశేషాలు ఆ అంచనాలను మరింత పెంచేశాయి. సైన్స్ ఫిక్షన్ కాదు.. అంతకుమించి అన్నట్లుగా ఈ సినిమా ఉండబోతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం..
సైన్స్ ఫిక్షన్ కాదు.. మైథలాజికల్ ఫాంటసీ:
‘వారణాసి’ సినిమా పోస్టర్లు చూసి చాలా మంది ఇది ఓ ప్యూన్ సైన్స్ ఫిక్షన్ మూవీ అనుకుంటున్నారు. అయితే దీనిపై స్పందించిన రాజమౌళి.. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, పౌరాణిక అంశాలు మళవించిన ఒక అద్భుతమైన ఫాంటసీ సినిమా అని స్పష్టం చేశారు. ఇక వివిధ రకాల జానర్లు, అనేక రకాల భావోద్వేగాల కలయికతో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు.
ఒకే కథలో ఆరు, ఏడు సినిమాల స్థాయి:
ఈ సినిమా గురించి రాజమౌళి చెబుతూ.. ఏకంగా ఆరు లేదా ఏడు సినిమాలలో ఉండేంత భారీ స్కేల్, కంటెంట్‌ను ఒక్కటే కథలో ఇముడ్చుడమే ఈ ప్రాజెక్ట్‌లోని అసలైన సవాలు అని తెలిపారు. తండ్రి, కొడుకుల మధ్య ఉండే బలమైన అనుబంధంతో పాటు, ఓ అందమైన లవ్ స్టోరీ ఈ చిత్రంలో ప్రధాన హైలైట్‌గా నిలవనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్ని విభిన్న అంశాలను ఒకే కథగా తీర్చిదిద్దడం తనకు కూడా ఒక కొత్త అనుభూతినిస్తోందని చెప్పారు.
చివరి దశకు షూటింగ్.. నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్:
ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే, ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, త్వరలోనే ఇదంతా పూర్తికానుందని సమాచారం. ఇక వచ్చే నెల నుంచి సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఒకేసారి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక మొత్తానికి చూస్తే, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న 'వారణాసి' సినిమా ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి ప్రపంచం ముందు నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అదిరిపోయే అప్డేట్స్ రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
