Begin typing your search above and press return to search.

రాజమౌళి కొత్త స్టైల్‌తో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్?

మొత్తానికి వారణాసి షూటింగ్ జెట్ స్పీడ్ లో జ‌రుగుతుండ‌టం ఇప్పుడు టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 March 2026 10:40 AM IST
రాజమౌళి కొత్త స్టైల్‌తో టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్?
X

రాజ‌మౌళి అంటే ఇప్పటివరకు పరిపూర్ణతకు ప్రతీక. ఆయన సినిమాలంటే భారీ విజువల్స్, కచ్చితమైన అవుట్‌పుట్. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న సినిమాలు చాలా ఆల‌స్య‌మ‌వుతూ ఉంటాయి. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే, రాజమౌళి తన వర్కింగ్ స్టైల్‌లో కీలకమైన మార్పు తీసుకొస్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ‌హేష్ బాబు తో చేస్తున్న వార‌ణాసి ప్రాజెక్ట్ ఈ మార్పుకు స్పష్టమైన ఉదాహరణగా మారుతోంది.

గ‌తంలో బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా వాయిదా

ఇప్పటివరకు రాజమౌళి పేరు వినగానే చెప్పిన డేట్ కు సినిమాను తీసుకురార‌నే అభిప్రాయం ఇండ‌స్ట్రీలో ఉండేది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ‌డ్జెట్ సినిమాల టైమ్ లో అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్ కూడా వాయిదా పడిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. వార‌ణాసి షూటింగ్ ఎలాంటి ఆలస్యం లేకుండా ముందు చేసుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే షెడ్యూల్స్ పూర్త‌వుతున్నాయ‌ని తెలుస్తోంది.

షూటింగ్ చేస్తూనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా

ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం పర్ఫెక్షన్ వ‌ర్సెస్ ప్లానింగ్ అనే సమతుల్యత. రాజమౌళి తనకెంతో ముఖ్యమైన విజువల్ క్వాలిటీని తగ్గించకుండా, అదే టైమ్ లో టైమ్‌లైన్‌ను కట్టుదిట్టంగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆయన సినిమాల్లో పోస్ట్ ప్రొడక్షన్‌కే ఎక్కువ టైమ్ ప‌డుతుంది. కానీ ఈసారి ఓ వైపు షూటింగ్ ను పూర్తి చేస్తూనే మ‌రోవైపు స‌మాంత‌రంగా పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ కూడా సమాంతరంగా కొన‌సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇది జ‌క్క‌న్న కెరీర్‌లో కొత్త స్ట్రాటజీగా భావించవచ్చు.

ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

మొత్తానికి వారణాసి షూటింగ్ జెట్ స్పీడ్ లో జ‌రుగుతుండ‌టం ఇప్పుడు టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇది కేవ‌లం ఒక సినిమా మార్పు మాత్రమే కాదు, ఒక డైరెక్ట‌ర్ మైండ్‌సెట్ లో వ‌చ్చిన మార్పుగా కూడా చూడొచ్చు. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత జ‌క్క‌న్నలో వ‌చ్చిన ఈ మార్పు, ఫ్యూచ‌ర్ ప్రాజెక్టుల‌పై కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజవుతుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేయ‌గా, ఈసారి రాజ‌మౌళి రిలీజ్ డేట్ టార్గెట్ ను మిస్ అయ్యేదేలేద‌ని చిత్ర యూనిట్ వ‌ర్గాలంటున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సినిమా లేటైనా ఫ‌ర్లేదు, అవుట్‌పుట్ బావుండాల‌ని అనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా టైమ్ కే వ‌స్తుంద‌ని తెలిసి ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.

ప‌లు అంశాల్లో మార్పులొచ్చే అవ‌కాశం

ఇది మొత్తం సినీ ఇండస్ట్రీకే ఓ సిగ్న‌ల్ లా అనుకోవచ్చు. రాజ‌మౌళి లాంటి టాప్ డైరెక్ట‌రే సినిమాను చెప్పిన డేట్ కు రిలీజ‌య్యేలా టైమ్‌లైన్ ను ఫాలో అవుతుంటే, ఇత‌ర డైరెక్ట‌ర్ల‌పై కూడా ఈ విష‌యంలో ఒత్తిడి పెర‌గ‌డం స‌హ‌జం. ఇది స‌క్సెస్ అయితే ప్రొడ‌క్ష‌న్ ప్లానింగ్, బ‌డ్జెట్ కంట్రోల్, రిలీజ్ స్ట్రాట‌జీ లాంటి అన్ని అంశాల‌ల్లో మార్పులొచ్చే అవ‌కాశ‌ముంది. మొత్తానికి వార‌ణాసి కేవ‌లం భారీ బ‌డ్జెట్ సినిమాలానే కాకుండా రాజ‌మౌళి వ‌ర్కింగ్ స్టైల్ లో ఓ కొత్త అధ్యాయానికి నాంది ప‌లికే ప్రాజెక్టుగా నిలిచే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, కీర‌వాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.