రాజమౌళి ఈస్పీడ్ షాకింగేనా!
రాజమౌళి సినిమా అంటే మొదలు పెట్టి పూర్తి చేయడానికి ఎలా లేదన్నా రెండేళ్ల సమయం పడుతుంది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాల విషయంలో అదే జరిగింది.
By: Srikanth Kontham | 30 Nov 2025 12:00 AM ISTరాజమౌళి సినిమా అంటే మొదలు పెట్టి పూర్తి చేయడానికి ఎలా లేదన్నా రెండేళ్ల సమయం పడుతుంది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` చిత్రాల విషయంలో అదే జరిగింది. షూటింగ్ పూర్తి చేయడంలో జక్కన్న డెడ్ స్లో అన్నది అందరికీ తెలిసిందే. ప్రతీ ప్రేమ్ ను చెక్కే క్రమంలో డిలే అవుతుంది. ది బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడం కోసం పనిచేసే క్రమంలో ఇలాంటివి తప్పవు. పాన్ ఇండియా సినిమాలు కాబట్టి మరింత బాధ్యతగా వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలస్యం అన్నది సహజమే. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` షూటింగ్ విషయంలో ఒక షెడ్యూల్ పూర్తయ్యే వరకూ మరో షెడ్యూల్ జోలికి వెళ్లేవారు కాదు.
షెడ్యూల్ అనేదే ప్లానింగ్ లో ఉండేది కాదు. దీంతో షెడ్యూల్స్ మధ్య ఎక్కువగా గ్యాప్ వచ్చేది. అయితే `వారణాసి` విషయంలో చిత్రీకరణ పరంగా పెద్దగా డిలే ఉండదన్నది తాజా సమాచారం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జక్కన్న `వారణాసి` చిత్రీకరణ విషయంలో ఓ ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నారట. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ లేకుండా ఏక కాలంలో రెండు..మూడు షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారట. దీనిలో భాగంగా సన్నివేశాలన్నింటిని వేర్వేరుగా డివైడ్ చేసి షూటింగ్ నిర్వహిస్తున్నారట. ఈ క్రమంలో కార్తీకేయ అవసరం కూడా ఎక్కువగానే పడుతుందట.
సెట్స్ లో రాజమౌళితో పాటు కార్తికేయ కూడా అంతే కష్టపడుతున్నాడట. దీనిలో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ కోసం దాదాపు అన్ని ప్లోర్స్ ను బ్లాక్ చేసారట. పేర్లలల్ గా షూటింగ్ నిర్వహించే క్రమంలోనే ఇలా బ్లాక్ చేసినట్లు చిత్ర వర్గాల నుంచి తెలిసింది. అలా చూసుకుంటే షూటింగ్ వేగంగానే పూర్తవుతుంది. మరి 2027 వరకూ రిలీజ్ ఎందుకు సాధ్యపడదంటే? విజువల్ ఎఫెక్స్ట్, సీజీ వర్క్ కారణంగానే రిలీజ్ కు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అడ్వెంచర్ థ్రిల్లర్ కావడం...అందులో `రామాయణం`తో ముడిపడిన కథ కావడంతో? ది బెస్ట్ విజువల్ ఎఫెక్స్ట్ తో ముస్తాబు కానుంది.
అందుకోసం ఎనిమిది నెలలకు పైగానే సీజీ పనులకే సమయం కేటాయిస్తున్నారట. ప్రఖ్యాత విదేశీ కంపెనీలతో ఒప్పం దం చేసుకున్నారుట. 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే `వారణాసి` షూటింగ్ 2026 సెప్టెంబర్..అక్టోబర్ కల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. అటుపై సీజీ పనులు మొదలు కానున్నాయి.
