Begin typing your search above and press return to search.

2027 సమ్మర్ కి వారణాసి ఫిక్స్ అవ్వొచ్చా..?

రాజమౌళి సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో అందరికీ తెలిసిందే. ఆయనతో సినిమా చేస్తే హీరోల ఇమేజ్ డబల్ అవుతుంది.

By:  Ramesh Boddu   |   16 Nov 2025 10:35 AM IST
2027 సమ్మర్ కి వారణాసి ఫిక్స్ అవ్వొచ్చా..?
X

రాజమౌళి సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో అందరికీ తెలిసిందే. ఆయనతో సినిమా చేస్తే హీరోల ఇమేజ్ డబల్ అవుతుంది. మొన్నటిదాకా టాలీవుడ్ లోనే తన సినిమాలు చేసిన జక్కన్న. పదేళ్ల క్రితం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకున్నాడు. అందులో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని కూడా మెప్పించాడు. ఏకంగా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే రాజమౌళి ఆ సినిమా కోసం పనిచేసిన బ్యాక్ ఎండ్ వర్క్ ఇంకా ప్రమోషన్స్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

వారణాసి గ్లింప్స్ తో సర్ ప్రైజ్..

రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో వారణాసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏడాది క్రితం మొదలు పెట్టగా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదని ఫ్యాన్స్ అప్సెట్ లో ఉండగా ఫైనల్ గా వారణాసి సినిమా గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేశారు. రామాయణం, వారణాసి ఇలా ఇతిహాస కథల రిఫరెన్స్ తో రాజమౌళి ఏదో మహాద్భుతాన్నే చేసేలా ఉన్నాడు. ఐతే రాజమౌళి ఈ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.

వారణాసి ఈవెంట్ లో రాజమౌళి సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమా 2027 సమ్మర్ రిలీజ్ అని అనౌన్స్ చేశాడు. ఓ విధంగా రాజమౌళి ప్లానింగ్ లో లేకపోయినా కీరవాణి వేలకొద్దీ ఫ్యాన్స్ ని చూసిన ఉత్సాహంలో ఈ విషయాన్ని చెప్పారు. అంతేకాదు మహేష్ పోకిరి డైలాగ్ ని రిఫరెన్స్ చేసుకుని కూడా ఇచ్చిన స్పీచ్ అదిరిపోయింది. ఐతే కీరవాణి చెప్పాడు సరే కానీ రాజమౌళి నిజంగానే 2027 సమ్మర్ కి వారణాసి తెస్తాడా అన్న డౌట్ అయితే ఉంది. ఎందుకంటే జస్ట్ వారణాసి నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కోసమే ఏడాదిగా సీజీ వర్క్ చేశామని చెప్పారు. మరి అలాంటిది సినిమా మొత్తం కావాలంటే చాలా టైం పడుతుంది.

అసలు కాంప్రమైజ్ అవ్వని రాజమౌళి..

కానీ ఈసారి రాజమౌళి రిలీజ్ టార్గెట్ పెట్టుకునే ఈ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. వారణాసి 2027 కాకపోయినా సెకండ్ హాఫ్ కల్లా అయినా రాజమౌళి రెడీ చేయాలని చూస్తున్నారు. ఐతే అవుట్ పుట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వని రాజమౌళి సినిమా తను సటటిస్ఫైడ్ అయ్యే వరకు చేస్తూనే ఉంటాడు. మరి రాజమౌళి మహేష్ వారణాసి కీరవాణి చెప్పినట్టుగా 2027 సమ్మర్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

వారణాసి సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ కనిపిస్తాడు. ఐతే రాముడిగా కూడా ఒక 30 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని లీక్ ఇచ్చేశారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. సో సినిమా ఎప్పుడొచ్చినా సరే మహేష్ యుపోరియా తో బాక్సాఫీస్ లు షేక్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.