'వారణాసి' కీలక అప్డేట్.. షూటింగ్‌పై టీమ్ ప్రకటన!
రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు జరుగుతుండగా, త్వరలో డబ్బింగ్ ప్రారంభం కానుంది. ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ పూర్తవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
By: Madhu Reddy | 16 Nov 2026 10:23 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ‘వారణాసి’ సినిమా నుంచి ఎట్టకేలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది. అసలు సినిమా అప్‌డేట్స్ ఏవిరా బాబు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రోజూ తెగ అడుగుతున్నారు. వాళ్లందరి టెన్షన్ పోగొడుతూ మూవీ టీమ్ తాజాగా ఎక్స్ లో ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. ‘వారణాసి’ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఆ విశేషాలు చూద్దాం..
రాజమౌళి - మహేశ్ కాంబోపై భారీ అంచనాలు :
మన రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి కదా..మరి ఇంటర్నేషనల్ లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒక మెయిన్ రోల్ చేస్తోంది. రాజమౌళి మార్క్ గ్రాండియర్ విజువల్స్, అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో ఈ సినిమాను చాలా పవర్‌ఫుల్‌గా తీస్తున్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి చిన్న విషయం బయటకు వచ్చినా నెట్టింట హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ:
ఇక ఇప్పుడు షూటింగ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో, టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG), బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులు చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయని టీమ్ చెప్పారు. రాజమౌళి సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనకు తెలిసిందేగా! అందుకే ప్రతీ సీన్ మనకు ఒక గూస్‌బంప్స్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా చాలా పక్కాగా రెడీ చేస్తున్నారు.
డబ్బింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే?:
ఇక ఇప్పుడు గ్రాఫిక్స్, మ్యూజిక్ పనులు నడుస్తున్నాయి కానీ, డబ్బింగ్ వర్క్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉందట. త్వరలోనే నటీనటుల డబ్బింగ్ కూడా మొదలుకానుంది. రాజమౌళి మన మహేశ్‌బాబును సినిమాలో ఏలా చూపించబోతున్నారు, ప్రియాంక చోప్రా పాత్ర ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలని అందరిలాగే నాకూ చాలా ఆతృతగా ఉంది.
రిలీజ్ డేట్ ఎప్పుడంటే? :
ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌తో సినిమాపై హైప్ ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉన్నా సరే, షూటింగ్ అయిపోయిందన్న న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ఇక రాజమౌళి, మహేశ్ బాబు కలిసి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రియేట్ చేయబోతున్నారో చూడాలని మనందరితో పాటు ఆడియన్స్ అందరూ కళ్లు కాయలు కాచేలాఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుంచి మరింత అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది..
