మిగతా నటీనటుల సంగతేంటి? ‘వారణాసి’ కాస్టింగ్‌పై రాజమౌళి సస్పెన్స్ ఎందుకు?
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచరస్ డ్రామా ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
By: Madhu Reddy | 19 July 2026 1:00 AM ISTదర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచరస్ డ్రామా ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రియాంక చోప్రా బర్త్‌డే సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పోస్టర్లను రిలీజ్ చేసి జక్కన్న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి ప్రధాన పాత్రలను మాత్రమే హైలెట్ చేస్తూ అప్‌డేట్స్ ఇస్తున్నారు. దీంతో మిగతా నటీనటుల సంగతేంటి? అసలు ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనే విషయాన్ని రాజమౌళి ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారు అనే చర్చ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ వివరాలు చూద్దాం..
జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే:
రాజమౌళి తన సినిమాల ప్రమోషన్ స్ట్రాటజీని చాలా కచ్చితంగా అమలు చేస్తారు.‘వారణాసి’ అనౌన్స్ చేసిన తర్వాత మహేష్ బాబు పృథ్విరాజ్, ప్రియాంక చోప్రా లుక్ మాత్రమే రివీల్ చేశారు. మిగిలిన పాత్రలను ఇంకా సీక్రెట్ గా ఉంచుతున్నారు.. ఇక గత నవంబర్‌లో భారీ ఈవెంట్‌లో ఫస్ట్ గ్లింప్స్ ఇచ్చినా, అందులోనూ హీరో చుట్టూ ఉన్న ప్రపంచాన్నే చూపించారు.
మిగతా స్టార్ కాస్ట్ ఎవరు? బయటకు రాని వివరాలు:
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. మరి ‘వారణాసి’ లాంటి గ్లోబల్ అడ్వెంచర్ సినిమాలో నటించే మిగతా నటీనటులు ఎవరు అనే లిస్ట్‌ను మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక సినిమా రిలీజ్‌కు కేవలం పది నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ, కాస్టింగ్ వివరాలను ఇంతలా దాచడం వెనుక ఆడియన్స్‌లో క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే వ్యూహం దాగుందేమో అని విశ్లేషకులు భావిస్తున్నారు..
ఆగస్టు 9న మహేష్ బర్త్‌డే.. ఆ రోజైనా క్లారిటీ వచ్చేనా?:
గతేడాది మహేష్ బాబు పుట్టినరోజుకు ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఈసారి ప్రియాంక చోప్రా బర్త్‌డే సర్‌ప్రైజ్ చూశాక, ఆగస్టు 9న రాబోయే సూపర్ స్టార్ బర్త్‌డే ట్రీట్‌పై ఆశలు భారీగా పెరిగాయి. ఇక ఆ రోజు రాబోయే గ్లింప్స్ లేదా టీజర్‌లోనైనా సినిమాలో ఉండే మిగతా కీలక పాత్రలను పరిచయం చేస్తారా, లేక ఎప్పటిలాగే కేవలం మహేష్ బాబు వన్-మ్యాన్ షో విజువల్స్ మాత్రమే చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
సినిమాలోని ప్రధాన పాత్రల చుట్టూనే హైప్ క్రియేట్ చేస్తూ, అసలైన సపోర్టింగ్ కాస్టింగ్‌ను సీక్రెట్‌గా ఉంచడం రాజమౌళి మార్క్ సస్పెన్స్ థ్రిల్ అని చెప్పొచ్చు. కథలోని అసలైన ట్విస్టులు రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే మిగతా నటీనటుల వివరాలను ఆయన రిపీట్ చేయడం లేదు. మరి ఈ భారీ సస్పెన్స్‌ను జక్కన్న ఎప్పుడు బ్రేక్ చేస్తారో, ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డే వేడుకల్లో దీనిపై ఏమైనా హింట్ ఇస్తారేమో వేచి చూడాలి..
