Begin typing your search above and press return to search.

రాజమౌళి కొత్త అడ్డా.. జనవరి వరకు నాన్ స్టాప్

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే.

By:  M Prashanth   |   26 Nov 2025 12:00 PM IST
రాజమౌళి కొత్త అడ్డా.. జనవరి వరకు నాన్ స్టాప్
X

రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ పై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిసిందే. 'వారణాసి' టైటిల్, విజువల్ టీజర్ ఇచ్చిన కిక్ నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు. అయితే బయట పెద్దగా హడావిడి కనిపించకపోయినా, షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమా కోసం జరుగుతున్న భారీ ఏర్పాట్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన షెడ్యూల్స్ ను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ షూటింగ్ లో పాల్గొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ జోరును కంటిన్యూ చేస్తూ హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియోను రాజమౌళి తన పూర్తి ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఇప్పుడు జరుగుతున్నది మామూలు హడావిడి కాదు.

హైదరాబాద్ లోని అత్యాధునిక సదుపాయాలు ఉన్న ఫిల్మీ సిటీ స్టూడియో ఇప్పుడు వారణాసి టీమ్ కు అడ్డాగా మారింది. ఆ స్టూడియోలోని ఫ్లోర్లన్నింటినీ వచ్చే ఏడాది జనవరి వరకు బుక్ చేసేశారట. అంటే అక్కడ చిన్నచిన్న పనులు, వర్క్ షాప్స్ కాదు.. ఏకంగా సినిమాలోని మేజర్ పార్ట్ షూటింగ్ జరగబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ల జాయింట్ వెంచర్ అయిన ఈ స్టూడియో, రాజమౌళి విజన్ కు తగ్గట్టుగా ఉండటంతో ఇక్కడే భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. జనవరి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ జరిపేలా ప్లానింగ్ జరిగిపోయింది. ఇప్పటికే వేరే లొకేషన్లలో షూట్ చేసిన టీమ్, ఇప్పుడు ఇక్కడ వేసిన భారీ సెట్స్ లో అసలు సిసలైన యాక్షన్ ను తెరకెక్కించనున్నారు.

ఈ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు, ఇతర ప్రధాన తారాగణం కూడా పాల్గొనే అవకాశం ఉంది. గ్లోబల్ రేంజ్ లో సాగే కథ కాబట్టి, దానికి తగ్గట్టుగానే భారీ సెట్టింగులు, విజువల్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, జనవరి వరకు ఈ స్టూడియోను బ్లాక్ చేశారంటే.. అవుట్ పుట్ ఏ రేంజ్ లో రానుందో ఊహించుకోవచ్చు.

ఇక'వారణాసి' షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. లుక్ టెస్టుల దశ ఎప్పుడో దాటిపోయింది, ఇప్పుడు గ్రౌండ్ లో రియల్ వార్ నడుస్తోంది. జనవరి వరకు ఫిల్మ్ సిటీలో జరిగే ఈ షూటింగ్ పూర్తయితే సినిమాలోని కీలక ఘట్టాలు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకోనున్నారు. ఫైనల్ గా సినిమాను 2027 సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.