Begin typing your search above and press return to search.

వారణాసి : ఆ విషయంలో జక్కన్న సక్సెస్‌ అయ్యేనా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం రూపొందిస్తున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

By:  Ramesh Palla   |   26 Nov 2025 3:27 PM IST
వారణాసి : ఆ విషయంలో జక్కన్న సక్సెస్‌ అయ్యేనా?
X

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం రూపొందిస్తున్న 'వారణాసి' సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మహేష్‌ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా మలయాళ స్టార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఇటీవల జరిగిన గ్లోబ్‌ ట్రోటర్‌ ఈవెంట్‌లో చెప్పేశాడని అంతా అనుకుంటున్నారు. కానీ సినిమాలో ఇంకా చాలా కీలకమైన పాత్రలు ఉంటాయని, వాటికి సంబంధించిన రాజమౌళి ఇంకా సస్పెన్స్‌ కొనసాగిస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా రామాయణం నేపథ్యంలో సాగుతుంది. ఈ జనరేషన్‌లో రామాయణంను ఎలా చూపించవచ్చు అనేది ఈ సినిమా రూపంలో జక్కన్న చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియో చూసిన తర్వాత ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది.

వారణాసి సినిమా షూటింగ్‌...

సినిమాలో రామాయణం అంటున్నారు, కానీ ఈ జనరేషన్‌కు రామాయణంను ఎలా కనెక్ట్‌ చేస్తాడు అనేది చాలా సస్పెన్స్‌గా ఉంది. రాజమౌళి ఏదైనా చేయగలడు, ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాకుండా గొప్ప విజనరీ ఉన్న వ్యక్తి. అందుకే ఆయన సినిమాలన్నీ ఒకదాన్ని మించి మరోటి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలతో రాజమౌళి తన సత్తా చాటారు. హాలీవుడ్‌ రేంజ్ సినిమాలను అందించగల సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి రాజమౌళి వారణాసి సినిమాలోని స్టార్‌ కాస్ట్‌ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి ఈ సినిమాలోని హనుమంతుడి పాత్రకు నటుడిని ఎలా ఎంపిక చేస్తాడు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబో...

రామాయణం అంటే కచ్చితంగా హనుమంతుడి పాత్ర ఉండాల్సిందే. ఇది రామాయణంను పోలి ఉన్న కథ అని చెబుతున్నప్పటికీ కచ్చితంగా హనుమంతుడి పాత్ర ఉండాల్సిందే. ఇప్పటికే రావణాసురుడిని ప్రతిభించే విధంగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ పోషిస్తున్న పాత్ర ఉంటుంది అంటున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ ఒప్పుకున్నారు. అయితే హనుమాన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఇప్పటికే ప్రముఖ సీనియర్‌ నటుడు మాధవన్‌ ను ఎంపిక చేశారని, కొన్ని సీన్స్ షూటింగ్‌ సైతం పూర్తి అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. మాధవన్ వంటి స్టార్‌ నటుడు ఈ సినిమాలో ఉండటం వల్ల మరింతగా స్టార్‌ కాస్ట్‌ వెయిట్‌ పెరిగినట్లు అవుతుంది. ఇది కచ్చితంగా సినిమాకు అదనపు ఆకర్షణ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

2027లో మహేష్‌ బాబు వారణాసి మూవీ

మహేష్‌ బాబు పాత్రకి తండ్రిగా ఎవరు నటించబోతున్నారు అనేది గత కొన్నాళ్లుగా ఉన్న ప్రశ్న. ఈ పాత్రకు ఉన్న ప్రాధాన్యత నేపథ్యంలో రాజమౌళి దాదాపుగా ఇరవై మంది సీనియర్‌లతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఫైనల్‌గా ఒక సీనియర్‌ నటుడిని ఎంపిక చేశారట. మొత్తానికి రాజమౌళి సినిమా మేకింగ్‌ విషయంలో ఎలాంటి తప్పులు చేయడు. కానీ ఆయన పాత్రల కోసం ఎంపిక చేసే నటీనటుల విషయంలో ఈసారి కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాజమౌళి ఈ విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్‌ అవుతాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజమౌళి సినిమా కోసం ఏం చేసినా ఒకటికి పది సార్లు ఆలోచించి చేస్తాడు. కనుక ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అని ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. కనుక 2027లో రాబోతున్న వారణాసి విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రతి ఎలిమెంట్‌ కూడా సినిమాలో కథ చెప్పడంలో సక్సెస్‌ అయ్యే విధంగా రాజమౌళి వర్క్‌ ఉంటుంది.