Begin typing your search above and press return to search.

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘వారణాసి’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కావాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగస్టుకు మారవచ్చని సమాచారం. జులై 29, ఆగస్టు 5, 12 తేదీలను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

By:  Madhu Reddy   |   24 Nov 2026 11:32 PM IST
మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!
X

టాలీవుడ్ లో చాల రోజుల తర్వాత రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మొదట 2027 ఏప్రిల్ 7న ఉగాదికి ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ డేట్ మారేలా కనిపిస్తోంది. క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గని రాజమౌళి, ఈ లేట్‌ను కూడా మహేశ్ ఫ్యాన్స్‌కు ఒక పెద్ద పండగలా మార్చే ప్లాన్ వేస్తున్నాడట. ఇంతకీ జక్కన్న వేసిన ఆ స్కెచ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

గ్రాఫిక్స్ పనుల కోసమే ఈ చిన్న బ్రేక్:

రాజమౌళి సినిమా అంటే విజువల్స్, గ్రాఫిక్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. డేట్ ఇచ్చేశాం కదా అని హడావుడిగా, ఏదో ఒకటి చుట్టేసి రిలీజ్ చేయడం జక్కన్నకు అస్సలు నచ్చదు. ఇక ఇప్పుడు ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన సీజీ పనులు ఇంకా చాలా మిగిలి ఉన్నాయట. అందుకే అవుట్‌పుట్ పక్కాగా రావడానికి మరికొంత టైమ్ తీసుకోవాలని టీమ్ ఫిక్స్ అయింది.

ఆగస్టులో మహేశ్ బర్త్‌డే డబుల్ ధమాకా:

ఏప్రిల్ 7న ఉగాది, ఆ తర్వాత శ్రీరామనవమి సెలవులు ఉన్నా, వాటిని వదిలేసి జులై 29, ఆగస్టు 5 లేదా ఆగస్టు 12 డేట్స్‌ను టీమ్ చూస్తోంది. ఇందులో ఆగస్టు ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌కే ఎక్కువ ఛాన్స్ ఉందట. ఎందుకంటే ఆగస్టు 9న మహేశ్ బాబు బర్త్‌డే. ప్రతి ఏడాది ఆ రోజు పాత సినిమాల రీ-రిలీజ్‌లతో హంగామా చేసే ఫ్యాన్స్‌కు, ఈసారి ఏకంగా రాజమౌళి సినిమానే థియేటర్లలో పడితే అంతకంటే పెద్ద పండగ ఇంకేముంటుంది?

‘రుద్ర’గా మహేశ్.. పక్కన క్రేజీ స్టార్లు:

మొదటిసారి రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నాడు. ఇక దీనికి తోడు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్లు కూడా ఇందులో ఉండటంతో సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. కొంచెం లేట్ అయినా సరే, థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక కొత్త లోకాన్ని చూపించడానికి జక్కన్న గట్టిగానే రెడీ అవుతున్నాడు.

లేట్ అయినా లేటెస్ట్‌గా వస్తుంది:

కొత్త డేట్ మీద అఫీషియల్ న్యూస్ ఇంకా రాకపోయినా, ఆగస్టు సెంటిమెంట్ మాత్రం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతోంది. ఇక ఉగాది మిస్ అయినా, మహేశ్ పుట్టినరోజు కానుకగా ‘వారణాసి’ వస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవడం ఖాయం. మరి ఆ మ్యాజిక్ చూడటానికి ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.