Begin typing your search above and press return to search.

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఉగాది పండుగ, లాంగ్ వీకెండ్, సమ్మర్ హాలిడేస్ సినిమాకు కలిసిరానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం మరో ప్లస్ పాయింట్. 120 దేశాల్లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్‌పై రాజమౌళి భారీగా దృష్టి పెట్టారు.

By:  Srikanth Kontham   |   16 Nov 2026 1:33 AM IST
వార‌ణాసి కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!
X

సూప‌ర్ స్టార్ మహేష్ -రాజ‌మౌళి కాంబినేషన్‌లోని తెర‌కెక్కుతోన్న `వారణాసి`పై పాన్ ఇండియాలో ఎలాంటి అంచ‌నాలున్నాయో చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లోబ‌ల్ వైడ్ 120 దేశాల్లో రిలీజ్ అవ్వ‌డంతో? అక్క‌డా బ‌జ్ అదే స్థాయిలో తీసుకురావాల‌న్న‌ది రాజ‌మౌళి ప్లాన్. అందుకు త‌గ్గట్టు బ్యాకెండ్ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో పాన్ వ‌ర‌ల్డ్ ప్ర‌చారం స్ట్రాట‌జీపై జ‌క్క‌న్న దృష్టి సారించ‌నున్నారు. అయితే ఇండియా వైడ్ ఈ సినిమాకు అన్ని ర‌కాలుగా క‌లిసొస్తుంద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే చిత్రాన్ని ఏప్రిల్ 7న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దేశీయంగా చూస్తే ఏప్రిల్ 7వ తేదీ ఉగాది పండుగ కానుకగా వస్తుండటం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది పరిశ్రమలకు బిగ్గెస్ట్ ప్లాస్ పాయింట్. సెలవులు కలిసిరావడం సినిమా కలెక్షన్లకు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ పూర్తిగా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఏప్రిల్..మే..జూన్ నెల‌ల్లో కొత్త సినిమాలేవి రిలీజ్ కు లేవు. జూన్ లో డ్రాగ‌న్ ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ లో అనుకున్న తేదీకి వార‌ణాసి రిలీజ్ అయితే ఇండియా వైడ్ తిరుగుండ‌దు.

రాజమౌళి సినిమాలంటేనే విజువల్ వండర్స్ అనే నమ్మకం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో బలపడింది. `బాహుబలి`, `ఆర్ఆర్ఆర్` సినిమాలతో గ్లోబల్ మార్కెట్‌లో ఇండియన్ సినిమా స్టామినాను చాటిచెప్పిన జక్కన్న `వారణాసి`తో ఏకంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి హై-ఎండ్ టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రాలకు గ్లోబల్ వైడ్‌గా ప్రీమియం థియేటర్ల అవసరం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సరైన పోటీ లేని సమయం.. సెలవుల సీజన్ అండ, ఐమ్యాక్స్ వంటి మోడరన్ ఫార్మాట్లలో ఏకకాలంలో విడుదల కావ‌డం వంటి అంశాలన్నీ` వారణాసి`కి బిగ్గెస్ట్ అసెట్‌గా మారుతాయి.

పోటీ ఉన్న రోజుల్లోనే రాజ‌మౌళి సినిమా అంటే ఓవైబ్ ఉంటుంది. అలాంటిది ఎలాంటి పోటీ లేకుండా బాక్సాఫీస్ మందుకొస్తే జ‌క్క‌న్న విద్వంసం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాకు హిట్ టాక్ వ‌చ్చిందంటే? వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ షేక్ అవ్వ‌డం ఖాయం. వారం ప‌ది రోజుల్లోనే దురంధ‌ర్ రికార్డుల‌ను సునాయాసంగా చేధించ‌గ‌ల‌దు.