ఇప్పటికి టైర్ వన్ హీరోలతో సినిమాలు చేస్తున్న ముగ్గురు సీనియర్ డైరెక్టర్లు...
భారీ యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేసుకొని ప్రేక్షకులను మెప్పించగలిగేలా మూవీ తీయడం రాజమౌళి ఒక్కడికే చెల్లింది.
By: Gopi Velupala | 29 Oct 2026 10:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లు ఉంటేనే కెరియర్ ఉంటుంది. లేకపోతే ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోవడమే. అలాంటి క్రమంలోనే దాదాపు 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో తమ ప్రతిభను చూపించుకుంటూ ముందుకు సాగుతున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లు ఉండటం విశేషం.ఈ ముగ్గురు ఇప్పటికీ టైర్ వన్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. వాళ్ళ సక్సెస్ ల వెనుక సీక్రెట్ ఏంటి వాళ్ల విజయాల వెనక ఉన్న ప్రధాన కారణాలను తెలుసుకుందాం...
రాజమౌళి
భారీ యాక్షన్ ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేసుకొని ప్రేక్షకులను మెప్పించగలిగేలా మూవీ తీయడం రాజమౌళి ఒక్కడికే చెల్లింది. తన సినిమాలో హీరో అత్యంత బలవంతుడిగా కనిపిస్తాడు. మదర్ సెంటిమెంట్, ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చే కథలను రాసుకుంటారు. రాసుకున్న కథను స్క్రీన్ మీద అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి అహర్నిశలు ప్రయత్న చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం మహేష్ బాబు తో 'వారణాసి' అనే మూవీ చేస్తున్నాడు. ఇది అత్యంత ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ కోసం ప్రపంచస్థాయి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు...
త్రివిక్రమ్
మాటలతో ప్రేక్షకులను మ్యాజిక్ చేసే త్రివిక్రమ్ మేకింగ్ విషయంలోనూ కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండస్ట్రీ లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. స్టార్ హీరో ఇమేజ్ కి సరిపడ కథల్ని రెడీ చేసి వాళ్ళలో దాగి ఉన్న పూర్తి స్థాయి నటులను బయటికి తీయడం లో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు. కుటుంబ కథ చిత్రాలను చేస్తూనే అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అందుకే ఇన్ని సంవత్సరాలైన త్రివిక్రమ్ ఇంకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో చేసిన 'ఆదర్శ కుటుంబం' మూవీ రేపు రిలీజ్ కి రెడీ అవుతుంది. తొందర్లోనే ఆయన ఎన్టీఆర్ తో 'గాడ్ ఆఫ్ వార్' అనే మూవీ చేయబోతున్నారు...
సుకుమార్
ప్రేక్షకుల మైండ్ కి పని చెప్పే దర్శకుడు సుకుమార్. ఆయన సినిమాల్లో హీరో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి పాత్ర కి ప్రాముఖ్యత ఉంటుంది. ఫైనల్ గా ఆయన ప్రేక్షకులను తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో అలాగే మేకింగ్ స్కిల్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. కాబట్టే ఆయన ఇన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం అటు రామ్ చరణ్, ఇటు సుకుమార్ ఇద్దరి కెరియర్ లను మార్చేసింది. అందుకే ఈ కాంబో లో వచ్చే మూవీ మీద మంచి అంచనాలున్నాయి...
