ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?
తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతోంది. మన దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో శైలిలో పాన్ ఇండియాలో రికార్డు లను తిరగరాస్తున్నారు.
By: Gopi Velupala | 4 Nov 2026 10:00 PM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతోంది. మన దర్శకులు ఒక్కొక్కరు ఒక్కో శైలిలో పాన్ ఇండియాలో రికార్డు లను తిరగరాస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒకే సినిమా తీస్తే ఎలా ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక్కో దర్శకుడికి ఒక్క ప్రత్యేకమైన క్రాఫ్ట్ లో మంచి పట్టు ఉంది.
రాజమౌళి : భారీ ఎమోషన్స్ ను హ్యాండిల్ చేస్తూ విజువల్ వండర్స్ ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు.
త్రివిక్రమ్ : పవర్ఫుల్ కథ మాటలతో అలరిస్తాడు.
సుకుమార్ : డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
సందీప్ రెడ్డి వంగ : బోల్డ్ కంటెంట్ ను సైతం ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించడంలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
ఈ దర్శకులందరు కలుస్తారా?
త్రివిక్రమ్ కథ మాటలు అందించిన స్క్రిప్ట్ కి సుకుమార్ స్క్రీన్ ప్లే రాయాలి. సందీప్ రెడ్డి వంగ చేత యాక్షన్ బ్లాక్ లను తెరకెక్కిస్తూ సౌండ్ డిజైన్ చేయించాలి. రాజమౌళి చేత డైరెక్షన్ చేయించాలి. అలా చేస్తే రాజమౌళి ఎమోషనల్ సన్నివేశాలను ఆన్ స్క్రీన్ మీద హై లెవెల్లో ఎలివేట్ చేస్తాడు. ఓవరాల్ గా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లు ఒక సినిమా చేస్తే చూడాలని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ ఊహ వినడానికి బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్ గా ఇది వర్కౌట్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ దర్శకులందరూ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్ల సినిమాలను డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఇది సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తుంది. రాజమౌళి, త్రివిక్రమ్ ఇద్దరిలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి మిగతా దర్శకులను ఏకం చేయగలిగితే ఇది కార్య రూపం దాలుస్తుంది.
బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయా
ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో అత్యంత ప్రస్టిజియస్ ప్రాజెక్ట్ గా మారుతుంది. ఒక్కో దర్శకుడు ఒక్కో క్రాఫ్ట్ లో మంచి ప్రావీణ్యం ఉన్నవారు కాబట్టి వాళ్లు కలిసి సినిమా చేస్తే అది బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
