అట్లీ జక్కన్ననే మించిపోతున్నాడే!
సినిమాపై అంచనాలు పెంచడానికి గోప్యత అనేది ఓ అద్భుతమైన ఆయుధం. గతంలో ఈ విషయంలో దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళిని మించిన వారు లేరనే పేరు ఉండేది.
By: Srikanth Kontham | 21 March 2026 10:00 PM ISTసినిమాపై అంచనాలు పెంచడానికి గోప్యత అనేది ఓ అద్భుతమైన ఆయుధం. గతంలో ఈ విషయంలో దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళిని మించిన వారు లేరనే పేరు ఉండేది. తన సినిమా సెట్స్ పై ఈగను కూడా వాలనిచ్చేవారు కాదు. కథాంశం లేదా నటీనటుల గెటప్స్ బయటకు రాకుండా జక్కన్న ఎంతో జాగ్రత్త పడేవారు. కఠినమైన నియమ నిబంధనలు అమలు పరిచేవారు. ఈ విషయంలో స్టార్ హీరోలు కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి వీలుండేది. ఏం చేసినా రాజమౌళి చేయాలి? తప్ప అందులోకి మరో వ్యక్తి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. అయితే ప్రస్తుతం మహేష్ తో తెరకెక్కిస్తోన్న `వారణాసి` విషయంలో రాజమౌళి తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ గ్లోబల్ స్థాయిలో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. రాజమౌళి `వారణాసి` విష యంలో గతంలో కంటే చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో టీజర్ లేదా ట్రైలర్ వచ్చే వరకు ఎలాంటి సమాచారం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు వర్క్‌షాప్స్ గురించి, టెక్నికల్ టీమ్ గురించి, చివరకు అనుష్క శర్మ వంటి తారల చర్చల గురించి కూడా ఏదో ఒక లీక్ లేదా అప్‌డేట్ బయటకు వస్తూనే ఉంది. దీనివల్ల అభిమానులు నిరంతరం ఉత్సాహంగా ఉంటున్నారు. రాజమౌళి స్వయంగా కాకపోయినా? ఆ ప్రాజెక్టులో భాగమైన అగ్ర నటీనటులు లేదా టెక్నీషియన్లు సోషల్ మీడియా ద్వారా చిన్న చిన్న హింట్స్ ఇస్తుండటంతో `వారణాసి` నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
కానీ విచిత్రం ఏంటంటే? ఇప్పుడిదే రాజమౌళి పాత స్ట్రాటజీని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా విషయంలో వాడుతున్నటన్లు కనిపిస్తోంది. అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్లో మరో గ్లోబల్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అట్లీ తీరు చూస్తుంటే గోప్యతలో జక్కన్ననే మించిపోయేలా కనిపిస్తున్నాడు.
ఇంత వరకూ అసలు బన్నీ సినిమా జోనర్ ఏంటి? బన్నీ లుక్ ఎలా ఉండబోతుంది? సినిమాలో నటించే ఇతర నటీనటులు ఎవరు? అన్న విషయాలపై నెట్టింగ్ గాసిప్పులు తప్ప ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
చిత్ర యూనిట్ నుంచి కూడా ఎలాంటి లీకులు బయటకు రాకుండా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి పని చేస్తున్నారు. సినిమా మొదలై నెలలు సమయం గడుస్తున్నా? ఒక్క అప్ డేట్ కూడా రాలేదు. దీంతో అట్లీ తీరు చూస్తుంటే?మితిమీరిన గోప్యత హైలైట్ అవుతుంది. అలాగే సినిమాలో ఏదో ఒక భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడనే పాజిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది. అది నేరుగా వెండి తెరపైనే చూపించాలనే పట్టుదలతో ఉన్నాడని అర్థమవుతోంది.
