Begin typing your search above and press return to search.

"బాహుబలిని చంపిన కట్టప్ప".. ఆ ట్విస్ట్ జక్కన్నది కాదట!

ఆ సీన్ డిస్కస్ చేస్తున్న టైమ్‌లోనే, రాజమౌళి అన్నయ్య, సంగీత దర్శకుడు కీరవాణి (పెద్దన్న) ఒక సలహా ఇచ్చారట.

By:  M Prashanth   |   29 Oct 2025 9:42 PM IST
బాహుబలిని చంపిన కట్టప్ప.. ఆ ట్విస్ట్ జక్కన్నది కాదట!
X

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?.. ఈ ఒక్క ప్రశ్న ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్‌గా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే. 'బాహుబలి: ది బిగినింగ్' క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్ చూసిన ఆడియెన్స్ మైండ్ బ్లాంక్ అయింది. పార్ట్ 2 కోసం రెండేళ్లు వెయిట్ చేయించింది ఆ ఒక్క సీనే. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆ ఐకానిక్ క్లిఫ్‌హ్యాంగర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్‌ను ఇప్పుడు డైరెక్టర్ రాజమౌళి రివీల్ చేశారు.

'బాహుబలి: ది ఎపిక్' రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి చేసిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయం బయటపడింది. నిజానికి, 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాను ఆ ట్విస్ట్‌తో ముగించాలనేది రాజమౌళి ఒరిజినల్ ప్లాన్ కాదట. ఆయన మొదట అనుకున్న ఎండింగ్ వేరే ఉందట.

రాజమౌళి ప్లాన్ ప్రకారం, ఫస్ట్ పార్ట్ ఎండింగ్.. యుద్ధంలో కాలకేయను ఓడించి, మాహిష్మతికి రాజుని ప్రకటించబడటంతో ముగిసిపోవాలి. అది ఒక హ్యాపీ ఎండింగ్. కట్టప్ప బాహుబలిని చంపిన తర్వాత, సెకండ్ పార్ట్‌లో రివీల్ చేద్దామనుకున్నారట. అయితే, సినిమాలో అస్లాం ఖాన్ (సుదీప్) పాత్ర కట్టప్పను బాహుబలి గురించి అడిగే సీన్ ఒకటి ఉంది. "నీకన్నా గొప్ప వీరుడు ఎలా చనిపోయాడు?" అని సుదీప్ అడిగినప్పుడు, "వెన్నుపోటు.. నేనే చంపాను" అని కట్టప్ప చెప్పే సీన్ ఆల్రెడీ స్క్రిప్ట్‌లో ఉందట.

ఆ సీన్ డిస్కస్ చేస్తున్న టైమ్‌లోనే, రాజమౌళి అన్నయ్య, సంగీత దర్శకుడు కీరవాణి (పెద్దన్న) ఒక సలహా ఇచ్చారట. "కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అనే ఒక సీన్‌ను సినిమా చివర్లో పెట్టి, అక్కడితో ఎండ్ చేద్దాం. అదే కరెక్ట్ క్లిఫ్‌హ్యాంగర్ అవుతుంది" అని ఆయనే చెప్పారట. ఆ ఒక్క మార్పు.. సినిమా రేంజ్‌నే మార్చేసింది.

ఆ క్లిఫ్‌హ్యాంగర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. "థియేటర్లో సినిమా (ఫస్ట్ పార్ట్) అయిపోయినా జనాలు లేవట్లేదు. ఎండ్ టైటిల్స్ పడుతున్నా అలాగే కూర్చున్నారు. ఏదో వస్తుందని వెయిట్ చేస్తున్నారు. తర్వాత ఎవరో చెప్పారు.. అయిపోయింది అని. అప్పుడు మొదలయ్యాయి క్లాప్స్.. అప్పుడు అర్థమైంది ఇది ఎంతలా స్ట్రైక్ అయిందో". మొత్తానికి, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్‌లలో ఒకటిగా నిలిచిన ఆ సీన్ ఐడియా రాజమౌళిది కాదని, కీరవాణి గారిదని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.