Begin typing your search above and press return to search.

వార‌ణాసి కోసం రాజ‌మౌళి డిఫ‌రెంట్ స్ట్రాట‌జీ?

రాజ‌మౌళి. టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఈయ‌న పేరు తెలియని వారుండ‌రు. తెలుగు సినిమా స్థాయిని గ్లోబ‌ల్ లెవెల్ కు తీసుకెళ్ల‌డ‌మే కాకుండా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘ‌న‌త కూడా రాజ‌మౌళిదే.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 Feb 2026 9:00 PM IST
వార‌ణాసి కోసం రాజ‌మౌళి డిఫ‌రెంట్ స్ట్రాట‌జీ?
X

రాజ‌మౌళి. టాలీవుడ్ లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఈయ‌న పేరు తెలియని వారుండ‌రు. తెలుగు సినిమా స్థాయిని గ్లోబ‌ల్ లెవెల్ కు తీసుకెళ్ల‌డ‌మే కాకుండా, ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘ‌న‌త కూడా రాజ‌మౌళిదే. అందుకే రాజ‌మౌళి నుంచి సినిమా వ‌స్తుందంటే కేవ‌లం తెలుగు సినిమా ప్రేక్ష‌కులే కాకుండా ప్ర‌పంచంలో ఉన్న మూవీ ల‌వ‌ర్స్ అంద‌రూ ఎంత‌గానో వెయిట్ చేస్తుంటారు.

ఆర్ఆర్ఆర్ మూవీ త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాజ‌మౌళి, త‌న త‌ర్వాతి సినిమాను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వార‌ణాసి అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచ‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాలో గ్లోబ‌ల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

గ‌తంలో షూటింగ్ చేయ‌ని ప్ర‌దేశాల్లో వార‌ణాసి షూటింగ్

ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయిలో గొప్ప‌గా నిల‌బెట్టాల‌నే ఉద్దేశంతో జ‌క్క‌న్న చాలానే ప్ర‌యత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం రాజ‌మౌళి ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమాను తెర‌కెక్కించని ప్ర‌దేశాల్లో షూటింగ్ ను చేయాల‌ని డిసైడ‌య్యార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం కూడా రాజ‌మౌళి డిఫ‌రెంట్ స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నార‌ని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌క్క‌న్న సినిమాల‌కు మంచి క్రేజ్

మామూలుగా ఎప్పుడైనా స‌రే రాజ‌మౌళి త‌న సినిమాల‌ను డిఫ‌రెంట్ గా చాలా ఉన్న‌త స్థాయిలో ప్ర‌మోట్ చేస్తార‌నే సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ముందు వ‌ర‌కు కూడా త‌నతో పాటూ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన వారితో మీడియా ముందుకొచ్చి సినిమాను వార్త‌ల్లో నిలిచేలా చేస్తారు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కు, త‌న సినిమాల‌కు మంచి డిమాండ్ ఉంద‌నే విష‌యాన్ని గ‌మ‌నించిన జ‌క్క‌న్న, త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం తెలుగు రాష్ట్రాలను మిన‌హాయించే ఎక్కువ‌గా ఫోక‌స్ చేసేవారు.

బాహుబ‌లి టైమ్ లో నార్త్ ప్ర‌మోష‌న్స్ పై ఫోక‌స్

బాహుబ‌లి సిరీస్ సినిమాల నుంచి కూడా రాజ‌మౌళి ఇదే చేస్తూ వ‌స్తున్నారు. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బాహుబ‌లికి మంచి క్రేజ్, డిమాండ్ ఉన్నాయ‌ని, నార్త్ ప్ర‌మోష‌న్స్ పై ఎక్కువ దృష్టి పెట్టి, అక్క‌డి వారికే ఎక్కువ ఇంట‌ర్వ్యూలిచ్చి, అక్క‌డే ప‌లు ఈవెంట్స్ నిర్వ‌హించ‌డం లాంటివి చేస్తూ వ‌చ్చారు. త‌ద్వారా బాహుబ‌లికి వేరే రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ వ‌చ్చి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి.

ఆర్ఆర్ఆర్ తో ఎన్నో రికార్డులు

బాహుబ‌లి త‌ర్వాత వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. బాహుబ‌లి టైమ్ లో క‌నీసం తెలుగు మీడియాకు అడ‌పాద‌డపా అయినా ఇంట‌ర్వ్యూలిచ్చిన జ‌క్క‌న్న‌, ఈ సినిమా కోసం ఇక్క‌డి మీడియాలో ఉన్న హైప్ ను దృష్టిలో పెట్టుకుని ఈసారి త‌న ఫోక‌స్ ను వేరే రాష్ట్రాలు, ఓవ‌ర్సీస్ పై పెట్టి, అక్క‌డ త‌న సినిమాను ప్ర‌మోట్ చేసి సినిమాపై ఊహించ‌ని హైప్ ను తీసుకొచ్చి భారీ ఓపెనింగ్స్ తో పాటూ ఎన్నో రికార్డుల‌ను సృష్టించారు.

కానీ ఇప్పుడు వార‌ణాసి కోసం మాత్రం జ‌క్క‌న్న చాలా డిఫ‌రెంట్ ప‌బ్లిసిటీ స్ట్రాట‌జీని వాడుతున్న‌ట్టు తెలుస్తోంది. ఎప్పుడూ సినిమాను అనౌన్స్ చేశాకే షూటింగ్ కు వెళ్లే జ‌క్క‌న్న వార‌ణాసి విష‌యంలో మాత్రం చాలా సింపుల్ గా ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ లేకుండా షూటింగ్ ను మొద‌లుపెట్ట‌డ‌మే కాకుండా, టైటిల్ రివీల్ ఈవెంట్ ను చాలా భారీగా ప్లాన్ చేసి ప్ర‌పంచ‌మంతా ఈ సినిమా గురించి మాట్లాడేలా చేశారు. ఇప్పుడు ప‌బ్లిసిటీ విష‌యంలో కూడా జ‌క్క‌న్న అలానే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం రాజ‌మౌళి చాలా భారీ మొత్తంలో ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చూస్తుంటే వార‌ణాసి కోసం జ‌క్క‌న్న నేష‌న‌ల్ తో పాటూ ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాను కూడా క‌వ‌ర్ చేయ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 2027 ఏప్రిల్ 7న వారణాసి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.