Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ తో రాజ‌మౌళి సంచ‌ల‌న చిత్రం!

అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట ప‌డింది. మ‌హేష్ త‌ర్వాత ప్ర‌భాస్ మ‌రోసారి రాజ‌మౌళి హీరో అవుతాడు? అనే విష‌యం రాజ‌మౌళి స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తాజాగా వినిపిస్తోన్న మాట‌.

By:  Srikanth Kontham   |   11 Nov 2025 2:00 PM IST
ప్ర‌భాస్ తో రాజ‌మౌళి సంచ‌ల‌న చిత్రం!
X

ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత ద‌ర్శ‌క శిఖ‌రం రాజమౌళి ఏ హీరోతో ప‌ని చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్ లాంటి స్టార్ల‌ను డైరెక్ట్ చేసిన త‌ర్వాత ఆ ఛాన్స్ ఏ హీరో ద‌క్కించుకుంటాడు? అన్న దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందుకుంటాడ‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. 'పుష్ప‌'తో పాన్ ఇండియాలో ఇమేజ్ సంపాదించ‌డం..అట్లీ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ అవుతాడు? అన్న కాన్పిడెన్స్ తో ? జ‌క్క‌న్న త‌దుప‌రి ఛాన్స్ తీసుకునే హీరో అత‌డే అవుతాడ‌ని అంతా భావిస్తున్నారు.

బాహుబ‌లితో పాటు మ‌రో క‌థ‌:

అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట ప‌డింది. మ‌హేష్ త‌ర్వాత ప్ర‌భాస్ మ‌రోసారి రాజ‌మౌళి హీరో అవుతాడు? అనే విష‌యం రాజ‌మౌళి స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తాజాగా వినిపిస్తోన్న మాట‌. 'బాహుబ‌లి' కి ఆప్ష‌న్ గా మ‌రో స్టోరీతో ప్ర‌భాస్ ను డైరెక్ట్ చేయాల‌ని రాజమౌళి ముందే ప్లాన్ చేసుకున్న విష‌యం నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ మాట‌ల్లో బ‌య‌ట ప‌డింది. ఆర్కా మీడియా అధినేత‌ల‌కు రాజ‌మౌళి ముందుగా వినిపించింది 'బాహుబ‌లి' క‌థ అయినా భారీ బ‌డ్జెట్ తో కూడిన చిత్రం అవుతుంద‌నే కార‌ణంతో? బాక్సింగ్ నేప‌థ్యంలో మ‌రో స్క్రిప్ట్ కూడా ప్ర‌త్యామ్నాయంగా పెట్టుకున్న‌ట్లు శోభు అభిప్రాయ‌ప‌డ్డారు. 'బాహుబ‌లి' భారీ బ‌డ్జెట్ తో కూడిన చిత్రం.

బాక్స‌ర్ క‌థ భ‌ద్రంగా:

రిస్క్ అవుతుంద‌ని భావించి రాజ‌మౌళి శోభు నో చెబితే గ‌నుక వెన‌క్కి త‌గ్గి బాక్స‌ర్స్ క‌థ‌ని పట్టాలెక్కిద్దామ‌ని సూచించారు. బాహుబ‌లి తో ఒక‌సారి ముందుకెళ్లిన త‌ర్వాత వెన‌క్కి రాకూడ‌ద‌ని అన్ని ర‌కాలుగా ఆలోచించుకోవాల‌ని జ‌క్క‌న్న ముందుగానే చెప్పారు. అలా అన్నింటికీ ఒకే అయిన త‌ర్వాతే 'బాహుబ‌లి' ప‌ట్టాలెక్కిన‌ట్లు తెలిపారు. అయితే నిర్మాత‌కు రిస్క్ త‌గ్గించ‌డం కోసం ఒకేసారి కాకుండా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే ఇబ్బంది ఉండ‌ద‌ని అలా రిలీజ్ చేసారు. మ‌రి బాక్స‌ర్స్ క‌థ ఏమైన‌ట్లు? అంటే ఆ స్టోరీ ఇంకా అలాగే ఉంది.

ప్ర‌భాస్ కి విల‌న్ మ‌ళ్లీ రానా:

అందులో హీరోగా ప్ర‌భాస్ అయితే బాగుంటుంద‌ని రాజ‌మౌళి స్ట్రాంగ్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందులోకి డార్లింగ్ ని కాద‌ని మ‌రో హీరోని తీసుకొచ్చే అవ‌కాశం ఉండ‌దు. బాక్సింగ్ క‌థ‌ల‌కు ప్ర‌భాస్ ప‌ర్పెక్ట్ క‌టౌట్. ఆయ‌న‌కు ధీటుగా రానా స‌రైన ప్ర‌త్య‌ర్ధి అవుతాడు. ఈ నేప‌థ్యంలో జ‌క్క‌న్న బాక్సింగ్ క‌థ‌ని తీస్తే గ‌నుక అందులో హీరో? ప్ర‌భాస్ అయితే విల‌న్ రానా అవ్వ‌డానికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అంత‌టి బ‌ల‌మైన పాత్ర‌ను రాజ‌మౌళి ప‌ర‌భాష న‌టుల‌కు ఇచ్చే అవ‌కాశం ఉండ‌దు.