జక్కన్న క్లారిటీ.. శోభు చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా?
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్ సినిమాలు.. ఒకే పార్ట్ గా బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ టైటిల్ తో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 30 Oct 2025 10:44 AM ISTతెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్క్లూజన్ సినిమాలు.. ఒకే పార్ట్ గా బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ టైటిల్ తో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. గురువారం(నేటి) రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి. దాదాపు అన్ని ఫార్మాట్స్ లోనూ మూవీ విడుదల కానుంది.
అయితే బాహుబలి: ది ఎపిక్ వెర్షన్ చివర్లో బాహుబలి-3 మూవీపై ప్రకటన ఉంటుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. దానిపై నిర్మాత శోభు యార్లగడ్డ ఇప్పటికే రెస్పాండ్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. బాహుబలి 3కి సంబంధించి చాలా వర్క్ చేయాల్సి ఉందన్నారు.
ఆ తర్వాత.. బాహుబలి: ది ఎపిక్ లో బాహుబలి 3 ప్రస్తావన లేకపోయినా ఓ సర్ప్రైజ్ మాత్రం ఆశించవచ్చంటూ చెప్పి ఆడియన్స్ తోపాటు అభిమానుల్లో ఆసక్తి రేపారు. దీంతో అదేంటోనని అంతా డిస్కస్ చేసుకున్నారు. ఎలాంటి సర్ప్రైజ్ ఉండనుందని మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఆ విషయంపై రాజమౌళి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్లే.
బాహుబలి ఎపిక్ వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రభాస్, రానా, రాజమౌళి చిట్ చాట్ వీడియో రిలీజ్ అయ్యి.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. గంటకుపైగా ఉన్న ఆ వీడియోలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించి రాజమౌళి, రానా, డార్లింగ్.. అనేక విషయాలను పంచుకున్నారు.
ఆ సమయంలో బాధనిపించినా బాహుబలి ది ఎపిక్ లో అవంతిక లవ్ స్టోరీ, రెండు మూడు పాటలు మరికొన్ని సన్నివేశాలను కటింగ్ లో తీసేశామని రాజమౌళి తెలిపారు. కథాంశంపైనే ఎక్కువగా దృష్టి పెట్టామన్న జక్కన్న.. అందరూ బాహుబలి 3 అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారని ప్రస్తావించారు. కానీ అది కానే కాదు అని తెలిపారు.
బాహుబలి ఎపిక్ ఇంటర్వెల్ లో త్రీడీ యానిమేషన్ టీజర్ ను.. రిలీజ్ చేసి బాహుబలి వరల్డ్ ను కంటిన్యూ చేస్తూ ప్రదర్శిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇషాన్ శుక్లా ఆ యానిమేషన్ చేశారని అన్నారు. అందరూ తప్పకుండా థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. దీంతో శోభు యార్లగడ్డ చెప్పిన సర్ప్రైజ్.. త్రీడీ యానిమేషన్ టీజర్ అయ్యి ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. మరి చూడాలి నిజమో కాదో.
