రాజమౌళి మైండ్ లో ఆ ముగ్గురేనా?
దర్శక శిఖరం రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ? ఉండబోతుందనేది టాలీవుడ్ వర్గాల్లో అతిపెద్ద ఉత్కంఠగా మారింది.
By: Srikanth Kontham | 17 July 2026 9:00 PM ISTదర్శక శిఖరం రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ? ఉండబోతుందనేది టాలీవుడ్ వర్గాల్లో అతిపెద్ద ఉత్కంఠగా మారింది. 'వారణాసి' తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు జోరుగా విని పించాయి. కానీ అల్లు అర్జున్ రాబోయే చిత్రాల కోసం ఇప్పటికే ఇతర దర్శకులతో కమిట్మెంట్లను ఖరారు చేసుకోవడం .. తాజా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో రాజమౌళి అడుగులు మళ్లీ పాత మిత్రుల వైపు మళ్లాయనే చర్చ జరుగుతోంది. ప్రభాస్, ఎన్టీఆర్ , రామ్ చరణ్ లలో ఎవరో ఒకరిని రాజమౌళి మళ్లీ తదుపరి చిత్రం కోసం ఎంచుకుంటారనే చర్చ జరుగుతోంది.
'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ విజయాన్ని అందించిన తర్వాత మళ్లీ అదే స్థాయిలో ఓ భారీ ప్రాజెక్టును రూపొం దించాలంటే? రాజమౌళి విజన్ అర్థం చేసుకోగల హీరోలు మాత్రమే సరైన ఎంపిక ఆయన భావిస్తుండవచ్చు. ప్రభాస్ విషయానికి వస్తే 'బాహుబలి' తర్వాత ఇద్దరి కాంబినేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నా? రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆయనకు ప్రత్యేకమైన ఎమోషన్. ఎన్టీఆర్ -రామ్ చరణ్‌ల విషయానికొస్తే వీరిద్దరితోనూ రాజమౌళికి ఉన్న కెమిస్ట్రీ అద్భుతం. వీరిలో ఎవరిని తీసుకున్నా సినిమాకు వచ్చే క్రేజ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తారు.
దర్శకుడిగా రాజమౌళి ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకే హీరోతో మళ్లీ పని చేయడం వల్ల ఆయన కొత్తగా ఏమన్నా చూపించగలరా? లేక ఒకే కాంబినేషన్ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. రాజమౌళి ఎంచుకునే తదుపరి కథ, ఆ హీరో ఇమేజ్‌కు ఎంతవరకు సెట్ అవుతుందనేదే కీలకం. ఆ తర్వాత హీరో ఎవరు? అన్నది క్లారిటీ వస్తుంది. రాజమౌళి సినిమాలంటే ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ఆ ప్రాజెక్టును గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఉంటుంది.
కాబట్టి పైన పేర్కొన్న ముగ్గురు స్టార్లలో ఎవరిని ఎంచుకున్నా? జక్కన్న తన స్క్రిప్టులో ప్రత్యేకమైన అంశాన్ని జోడించడం ఖాయం. ఒకవేళ వీరు కాకుండా మరొక కొత్త హీరోని ఎంచుకున్నా? ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే రాజమౌళి ఆలోచనలు సాధారణ ప్రేక్షకుడికి అందనంత ఎత్తులో ఉంటాయన్నది అంతే వాస్తవం. మరి రాజమౌళి పాన్ ఇండియా ప్రయాణంలో తదుపరి హీరో ఎవరవుతారు? అన్నది వేచి చూడాలి. ఆయన ఏ హీరోను ఎంచుకున్నా? ఆ హీరోకు రాజమౌళి ఇమేజ్ తోనే పాన్ ఇండియా క్రేజ్ తోడవుతుందన్నది అంతే వాస్తవం.
