Begin typing your search above and press return to search.

మూడ‌వ ప్ర‌పంచ యుద్దం మొద‌లైనా 'వార‌ణాసి' ఆగ‌దు!

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది.

By:  Srikanth Kontham   |   9 March 2026 3:43 PM IST
మూడ‌వ ప్ర‌పంచ యుద్దం మొద‌లైనా వార‌ణాసి ఆగ‌దు!
X

మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసిన సినిమాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ప‌డింది. యూరప్ వెళ్లే విమానాలు ఎక్కువగా దుబాయ్ మీదుగానే వెళ్లాల్సి ఉండటం, అక్కడ విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతం మీద బాంబులు జార విడుస్తారో తెలియ‌ని ఉద్రిక్త‌త ప‌రిస్థుల న‌డుమ రిస్క్ తీసుకోవ‌డానికి ఏ ద‌ర్శ‌క‌, నిర్మాత సిద్దంగా లేరు. కానీ ద‌ర్శ‌శిఖ‌రం రాజ‌మౌళి మాత్రం మూడ‌వ ప్ర‌పంచం యుద్దం మొద‌లైన స‌రే వెన‌క్కి త‌గ్గేలా క‌నిపించ‌లేదు.

మీ వార్ మీది..నా వార్ నాది అంటూ అమెరికా-ఇజ్ర‌యెల్-ఇరాన్ దేశాల మ‌ధ్య యుద్దాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌ణాళిక సిద్దం చేస్తున్నారు. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో జ‌క్క‌న్న అండ్ కో షూటింగ్ కి సిద్ద‌మ‌వుతున్నారు. ఇటీవ‌లే జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు -రాజమౌళి బృందం, దుబాయ్ మీదుగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. దీంతో అంటార్కిటికా షెడ్యూల్ విష‌యంలోనూ రాజ‌మౌళి ఇదే వ్యాహాన్ని ర‌చిస్తున్నారు. అంటార్కిటాకు చేరుకునేంద‌కు చాలా ర‌కాల మార్గాలున్నాయి.

కానీ రాజ‌మౌళి ఆ మార్గంలో కాకుండా కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. దీనిలో భాగంగా తొలుత‌ నేరుగా దక్షిణ అమెరికాకు వెళ్లి, అక్కడి నుండి అంటార్కిటికా చేరుకోనున్నారు. మ‌రి అంటార్కిటికాలో యుద్దం వ‌చ్చే అవ‌కాశం లేదా? అంటే అందుకు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ఎలాంటి యుద్ద వాతావ‌ర‌ణం లేదు. అందుకు కార‌ణం అంటార్కిటికా ఒప్పందం. 1959లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం, అంటార్కిటికాను కేవలం శాంతియుతమైన పనులకు , శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే ఉపయోగించాలి.

అక్క‌డ సైనిక కార్యకలాపాలపై నిషేధం ఉంది. ఈ ఖండంలో ఎటువంటి సైనిక స్థావరాలను నిర్మించడం, ఆయుధాలను పరీక్షించడం లేదా సైనిక విన్యాసాలు చేయడం పూర్తిగా నిషేధం. ఏ ఒక్క దేశం కూడా అంటార్కిటికా మాదే అని సొంతం చేసుకోలేదు. ఇది ప్రపంచ దేశాల ఉమ్మడి ఆస్తిగా పరిగణించబడుతుంది. ఇక్క‌డ ఖనిజాల కోసం తవ్వకాలు జరపడం కూడా నిషేధించబడింది. కేవలం పర్యాటకం , పరిశోధనలకు మాత్రమే అనుమతి ఉంటుంది. షూటింగ్ అనుమ‌తులు కూడా ఉండ‌వు. కానీ రాజ‌మౌళి త‌న ఇన్ ప్లూయెన్స్ తో `వార‌ణాసి` షూటింగ్ అనుమ‌తులు సంపాదించారు. దీంతో రాజ‌మౌళి అండ్ కో ఎలాంటి ఇబ్బంది లేకుండా వార‌ణాసి షూటింగ్ చేసుకోవ‌చ్చు. అక్క‌డ వ‌ర‌కూ చేర‌డ‌మే కాస్త సాహ‌సంగా ప‌రిగ‌ణించాలి.