Begin typing your search above and press return to search.

మహేష్ తో మూవీ.. జక్కన్న పోస్టర్లపై డిస్కషన్ ఏంటి?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   13 Nov 2025 5:38 PM IST
మహేష్ తో మూవీ.. జక్కన్న పోస్టర్లపై డిస్కషన్ ఏంటి?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ ప్రాజెక్టు గ్లోబ్ ట్రాటర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక్కొక్క షెడ్యూల్ ను అనుకున్న విధంగా జక్కన్న కంప్లీట్ చేసుకుని దూసుకుపోతున్నారు.

అయితే SSMB 29 ప్రాజెక్టు పూజా కార్యక్రమం జరిగిన నుంచి నిన్న మొన్నటి వరకు ఒక్క అప్డేట్ అంటే ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు రాజమౌళి. దీంతో ఆయన ప్లాన్ ఏంటోనని అంతా డిస్కస్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం.. నవంబర్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తామని చెప్పి.. ఒక ప్రీ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇప్పుడు మరో రెండు రోజుల్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన భారీ ఈవెంట్ లో మూవీ టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నారు రాజమౌళి. గ్లింప్స్ కూడా విడుదల చేస్తారని టాక్ వినిపిస్తున్నా.. ఆ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ రీసెంట్ గా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్స్ ను నెట్టింట రిలీజ్ చేశారు.

సినిమాలో వారిద్దరూ మందాకిని, కుంభ రోల్స్ పోషిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఫస్ట్ లుక్స్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో కొత్త చర్చలు మొదలయ్యాయి. అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలో కొందరు పోస్టర్లు అదిరిపోయాయంటే.. మరికొందరు రాజమౌళి స్టాండర్డ్ కు తగ్గట్టు లేవని చెబుతున్నారు.

పోస్టర్లు ఆయన నుంచి ఆశించిన స్థాయిలో లేవని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశామని.. కానీ రాజమౌళి బ్రాండ్ కంటే తక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆడియన్స్ గ్రాఫిక్స్ కు బాగా అలవాటు పడ్డారని అంటున్నారు.

ఏఐ ద్వారా క్రియేట్ చేసిన పోస్టర్లు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆడియన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రాజమౌళి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్స్ కొందరినీ ఆకట్టుకోలేదని అర్థమవుతోంది. అయితే పోస్టర్స్ విషయంలో కొందరు అనుకున్న లేకపోయినా.. రాజమౌళిను తక్కువ అంచనా వేయకూడదు. ఆయన రేంజే వేరు.. లెక్కే వేరు.. కాబట్టి కచ్చితంగా నెక్స్ట్ కంటెంట్ తో అందరినీ మెప్పిస్తారేమో చూడాలి.