హైదరాబాద్ లో ఈవెంట్.. రీసౌండ్ హాలీవుడ్ కి వినిపించేలా..!
ఐతే నవంబర్ లో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. నవంబర్ 11 లేదా 15 తేదీల్లో సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి.
By: Ramesh Boddu | 21 Oct 2025 10:24 AM ISTదర్శకధీరుడు రాజమౌళి RRR తో ఇంటర్నేషనల్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. బాహుబలితో పాన్ ఇండియా షేక్ చేసిన జక్కన్న ట్రిపుల్ ఆర్ సినిమాతో నాటు నాటు సాంగ్ ని ప్రపంచం మొత్తం కాలు కదిపేలా చేశాడు. ఐతే ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమాను కూడా ఈసారి ఫస్ట్ టీజర్ నుంచే ఇంటర్నేషనల్ రీచ్ ఉండాలని చూస్తున్నాడు. మహేష్ తో రాజమౌళి సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.
హైదరాబాద్ వేదికగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సమక్షంలో..
ఐతే నవంబర్ లో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. నవంబర్ 11 లేదా 15 తేదీల్లో సినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నాడు రాజమౌళి. ఐతే ఇది ఒక వేడుకలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ వేదికగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సమక్షంలో ఈ సినిమా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి సినిమా తీయడమే కాదు ఎప్పుడు ఎలాంటి అప్డేట్ ఇవ్వాలన్నది ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉంటాడు.
ఇప్పటివరకు 28 సినిమాలు చేసిన మహేష్ కేవలం తెలుగు సినిమాలు అది కూడా ఒరిజినల్ కథలు చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి సినిమాతో చేస్తున్న సినిమాతో డైరెక్ట్ గా హాలీవుడ్ ని టార్గెట్ పెట్టుకున్నాడు మహేష్. రాజమౌళి సినిమా అంటేనే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. ఇక ఇప్పుడు అందులో మహేష్ లీడ్ రోల్ అంటే ఇక ఆ రేంజ్ మరింత పెరిగింది.
తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ లో..
మహేష్, రాజమౌళి ఇద్దరు కూడా మరోసారి తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ లో చూపించేలా చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. నవంబర్ నుంచి ఎస్.ఎస్.ఎం.బి 29 సంబరాలు మొదలవుతున్నాయి. ఐతే హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్ వెన్యూని ఇంకా డిసైడ్ చేయలేదు. ప్రస్తుతం అదే డిస్కషన్ లో ఉందని తెలుస్తుంది.
మహేష్ ఈ సినిమా కోసం తన లుక్ మార్చేశాడు. ఎప్పుడు షార్ట్ హెయిర్ తో కనిపించే మహేష్ రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్ పెంచాడు. ఈ సినిమాలో మహేష్ లుక్ ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ లవర్స్ కి ఐఫీస్ట్ గా ఉంటుందని తెలుస్తుంది. గ్లోబ్ త్రొటెన్ కాన్సెప్ట్ తో ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా వస్తుంది. నవంబర్ నుంచే మూవీ టార్గెట్ ఏంటన్నది తెలిసేలా టీజర్ బ్లాస్ట్ ఉండబోతుంది. సో సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది కూడా ఆ టీజర్ లో రివీల్ చేస్తారేమో చూడాలి.
