Begin typing your search above and press return to search.

సినిమాకే కాదు ఈవెంట్ కి రాజమౌళి ముద్ర..!

రాజమౌళి సినిమాలు ఎందుకంత పర్ఫెక్ట్ గా ఉంటాయి. ప్రతి సినిమాతో రాజమౌళి ఎలా సూపర్ హిట్ అందుకుంటున్నాడు అంటే అతని ప్లానింగ్ అని అందరు సమాధానం చెబుతారు.

By:  Ramesh Boddu   |   14 Nov 2025 11:31 AM IST
సినిమాకే కాదు ఈవెంట్ కి రాజమౌళి ముద్ర..!
X

మరో 24 గంటల్లో గ్లోబ్ త్రొట్టర్ (Globe Trotter) ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ మూవీ అప్డేట్స్ ని ఇప్పటివరకు దాచేస్తూ వచ్చిన రాజమౌళి ఈ నెల 15న గ్లోబ్ త్రొట్టర్ (Globe Trotter) ఈవెంట్ తో కొన్ని విషయాలు వెల్లడించబోతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి పృథ్వీరాజ్ లుక్, ప్రియాంక చోప్రా పోస్టర్ రిలీజ్ అవ్వడమే కాకుండా గ్లోబ్ త్రొట్టర్ సంచారి సాంగ్ సెన్సేషన్ గా మారింది. ఇక ఈవెంట్ లో మహేష్ లుక్ తో పాటుగా ఒక టీజర్ కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట.

కథ రాసినప్పటి నుంచి రిలీజ్ వరకు..

రాజమౌళి సినిమాలు ఎందుకంత పర్ఫెక్ట్ గా ఉంటాయి. ప్రతి సినిమాతో రాజమౌళి ఎలా సూపర్ హిట్ అందుకుంటున్నాడు అంటే అతని ప్లానింగ్ అని అందరు సమాధానం చెబుతారు. సినిమా కథ రాసినప్పటి నుంచి సెట్స్ మీదకు వెళ్లడం.. షూటింగ్.. రిలీజ్ ప్రమోషన్స్.. రిలీజ్ తర్వాత కూడా రాజమౌళి పనిచేస్తాడు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ అంటే రాజమౌళి క్రియేటివ్ టీం అంతా రెక్కలు తొడుగేసుకుంటుని.

రాజమౌళి ప్లానింగ్ లో భాగంగానే ఈవెంట్ ఎలా చేయాలి.. ఎప్పుడెప్పుడు ఏ అప్డేత్ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారు. రేపు జరగబోతున్న గ్లోబ్ త్రొట్టర్ (Globe Trotter) ఈవెంట్ కి కూడా రాజమౌళి ఇలాంటి భారీ ప్లానింగ్ తోనే వస్తున్నారు. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా స్టార్ యాంకర్ సుమని ఫిక్స్ చేయగా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మొత్తం చూసేయాలి కాబట్టి బాలీవుడ్ యూట్యూబర్ ఆశిష్ ని రంగంలోకి దించారు.

SSMB29 సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈ సినిమా ఈవెంట్ కోసమే ఇంత భారీ ప్లానింగ్ చేస్తున్నారు. ఈవెంట్ ఎలా జరగాలి అన్నది ముందే సుమ, ఆశిష్ తో పాటు కార్తికేయ, కీరవాణి అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాజమౌళి లాంటి డైరెక్టర్ తన సినిమా ఈవెంట్ కూడా తన మార్క్ ఉండేలా చూస్తాడు అన్నది చెప్పడం కాదు ఈవెంట్ కోసం కూడా రాజమౌళి చూపించే డెడికేషన్ చూసే సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్.

Globe Trotter ఫ్యూజులు అవుట్ అయ్యే అప్డేట్స్..

ఇక ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి గ్లోబ్ త్రొట్టర్ (Globe Trotter) అప్డేట్స్ ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తుండగా తప్పకుండా ఫ్యాన్స్ కి ఈ ఈవెంట్ లో టీజర్ తో గూస్ బంప్స్ స్టఫ్ అందిస్తారని అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీరాజ్ ని కుంభాగా.. ప్రియాంకా చోప్రాని మందాకినిగా పరిచయం చేసిన రాజమౌళి మహేష్ ని ఎలా పరిచయం చేస్తాడు అన్నది ఆడియన్స్ లో ఎగ్జైటింగ్ గా ఉంది.

ఈవెంట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పేలా జక్కన్న ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాతో రాజమౌళి తన సత్తా చాటనున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా కాదు డైరెక్ట్ గా మహేష్ ఇంటర్నేషనల్ రీచ్ ఉన్న సినిమా చేయడం ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ చేస్తుంది.