Begin typing your search above and press return to search.

వారణాసి టైటిల్ ఇంగ్లీష్ లోనే ఎందుకంటే..?

రాజమౌళి వారణాసి సినిమా గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

By:  Ramesh Boddu   |   19 Nov 2025 1:37 PM IST
వారణాసి టైటిల్ ఇంగ్లీష్ లోనే ఎందుకంటే..?
X

రాజమౌళి వారణాసి సినిమా గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు సినిమాపై పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుందో మరికొందరు రాజమౌళి స్పీచ్ పై నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ టైంలోనే వారణాసి టైటిల్ పై కూడా వివాదం మొదలైంది. ఆ టైటిల్ ని ఆల్రెడీ రెండేళ్ల క్రితమే సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రిజిస్టర్ చేయించాడు. రాజమౌళి వారణాసి గ్లింప్స్ రిలీజ్ కు రెండు రోజుల ముందే ఒక పోస్టర్ కూడా వదిలారు.

రాజమౌళి మిగతా భాషల్లో వారణాసి టైటిల్ రిజిస్టర్..

ఐతే అవేవి పట్టించుకోకుండా మహేష్ సినిమాకు రాజమౌళి వారణాసి అని టైటిల్ లాక్ చేశాడు. ఐతే సుబ్బారెడ్డి తను రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ ఎలా వాడతారంటూ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ రైజ్ చేశాడట. ఐతే ఒక్క తెలుగులో తప్ప రాజమౌళి మిగతా భాషల్లో వారణాసి టైటిల్ రిజిస్టర్ చేయించారని తెలుస్తుంది. అందుకే సినిమా టైటిల్ ని తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో వేశారని చెబుతున్నారు.

సో వారణాసి ఇంగ్లీష్ టైటిల్ వేయడానికి రీజన్ తెలుగులో ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ అయిందన్న కారణమన్నమాట. మరి వారణాసి ఇంగ్లీష్ టైటిల్ తోనే సినిమా కూడా రిలీజ్ చేస్తారా లేదా ఆ టైటిల్ విషయంలో ఆ డైరెక్టర్ తో బేరసారాలు చేస్తారా అన్నది చూడాలి. ఏది ఏమైనా వారణాసి గ్లింప్స్ నుంచి సినిమా గురించి పాజిటివిటీ కన్నా ఎక్కువ నెగిటివిటీ రన్ అవుతుంది. దీని వెనుక రీజన్స్ ఏమైనా సరే తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న రాజమౌళి మీద ఇలాంటి నెగిటివిటీ ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పొచ్చు.

మహేష్ ఫ్యాన్స్ సూపర్ ఫీస్ట్..

ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం వారణాసి మీద జరుగుతున్న మిగతా ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి గ్లింప్స్ లో జక్కన్న ఇచ్చిన క్లూస్ తో ఇంకాస్త డీటైలింగ్ కి ట్రై చేస్తున్నారు. అంతేకాదు సినిమాలో రుద్ర పాత్రలో మహేష్ లుక్ ఫ్యాన్స్ కి సూపర్ ఫీస్ట్ అందించారు. ఐతే రాముడిగా మహేష్ లుక్ ఎలా ఉంటుంది అనుకుంటూ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రియాంకా చోప్రా మందాకిని గా చేస్తున్న ఈ సినిమాలో విలన్ కుంభ పాత్రలో పృధ్వీరాజ్ సుకుమారన్ అదరగొట్టబోతున్నాడు.

ఈ సినిమాకు కీరవాణి మరోసారి తన అద్భుతమైన మ్యూజిక్ తో సినిమా రేంజ్ పెంచాలని చూస్తున్నారు. ఆల్రెడీ గ్లోబ్ త్రొట్టర్ సంచారి సాంగ్ సెన్సేషన్ గా మారగా సినిమాలో మ్యూజిక్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించేలా కీరవాణి ఎఫర్ట్స్ పెడుతున్నారని తెలుస్తుంది. మహేష్ రాజమౌళి వారణాసి సినిమా 2027 సమ్మర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారట. ఐతే రీసెంట్ గా జరిగిన వారణాసి గ్లింప్స్ ఈవెంట్ లో రిలీజ్ ఎప్పుడన్నది రాజమౌళి చెప్పలేదు కానీ కీరవాణి హింట్ ఇచ్చేశారు.