మహేష్ గ్లోబల్ జర్నీ తో టాలీవుడ్ మరో మెట్టు పైకి!
ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ప్రయాణం భవిష్యత్తులో మరింత మంది స్టార్ హీరోలు అంతర్జాతీయ వేదికలపై స్థిరపడటానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
By: Srikanth Kontham | 11 July 2026 1:00 AM ISTతెలుగు చిత్రసీమ దశాబ్దాలుగా ఎన్నో మార్పులకు లోనవుతున్నా? ప్రస్తుత తరుణంలో సూపర్ స్టార్ మహేష్ చేపట్టిన గ్లోబల్ జర్నీ టాలీవుడ్ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కిస్తుందన్నది కాదనలేని నిజం. ఒక ప్రాంతీయ స్టార్‌గా కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమాలను ఎంచుకోవడం ద్వారా మహేష్ పరిశ్రమ గమనాన్ని మారుస్తున్నారు. రాజమౌళి - మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న గ్లోబల్ ప్రాజెక్ట్ `వారణాసి` ప్రపంచ సినిమా పటంలో తెలుగు సినిమాకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది. మహేష్ లో ఉన్న సహజ సిద్ధమైన హాలీవుడ్ స్టార్ ఫీచర్స్ అదనపు బలాన్ని ఇస్తున్నాయి.
ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి నటుడిగా కనిపించే పరిణతి, గ్లోబల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి ప్లస్‌గా మారుతున్నాయి. మహేష్ బాడీ లాంగ్వేజ్, ఫ్యాషన్ సెన్స్ కెమెరా ముందు ప్రదర్శించే హావభావాలు హాలీవుడ్ సినిమాల్లో కనిపించే స్థాయి నటనకు ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో కఠినమైన శిక్షణ తీసుకోవడం, సినిమా కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడం వంటివి మహేష్ అంకితభావాన్ని చాటుతున్నాయి. నటుడిగా తన పరిధిని విస్తరించుకోవాలని మహేష్ చేస్తున్న ప్రయత్నం టాలీవుడ్ లో మిగతా స్టార్ హీరోలకు కూడా ఓ కొత్త దారిని చూపి స్తోంది.
ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ప్రయాణం భవిష్యత్తులో మరింత మంది స్టార్ హీరోలు అంతర్జాతీయ వేదికలపై స్థిరపడటానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సినిమాలు రూపొందించడం తో టాలీవుడ్ సినిమాల బడ్జెట్ .. సాంకేతిక ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మహేష్ ఎంచుకుంటున్న కథాంశాలు కేవలం ఒక వర్గానికి పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉంటున్నాయి. ఇది తెలుగు నిర్మాతలు, దర్శకులు , సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకోవడానికి గొప్ప వేదికను అందిస్తోంది.
ఈ మార్పు తో టాలీవుడ్ చిత్రాలకు దక్కుతున్న ఆదరణ బాక్సాఫీస్ వసూళ్లను మాత్రమే కాకుండా పరిశ్రమ గౌరవాన్ని కూడా పెంచుతోంది. గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమాలకి వస్తున్న గుర్తింపు భారతీయ సినిమా వైపు ప్రపంచం చూసేలా చేస్తోంది. మహేష్ లాంటి గ్లోబల్ ఐకాన్ లీడ్‌లో ఉండటం వల్ల అంతర్జాతీయ పంపిణీదారులు .. థియేటర్ల యజమానులు చిత్రాలను ప్రదర్శించడానికి ముందుకొస్తున్నారు. `వారణాసి` ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేస్తోన్న తీరు..రాజమౌళి గ్లోబల్ ఇమేజ్ తోనే ఇదంతా సాధ్యమవుతుంది.
చివరిగా మహేష్ గ్లోబల్ జర్నీ టాలీవుడ్ కు కొత్త శకాన్ని పరిచయం చేస్తోంది. ఆయనలోని స్టార్ ఫీచర్స్ , ప్రపంచ స్థాయి కథాంశాల కలయిక తెలుగు సినిమాను గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజేతలుగా నిలబెడుతుంది. రాబోయే రోజుల్లో మహేష్ ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని ఎలా? అంతర్జాతీయ శిఖరాలకు చేరుస్తాయో వేచి చూడాలి.
