వారణాసి గ్రాస్.. అలా జరిగితే రికార్డులన్నీ గల్లంతే!
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 5 Jun 2026 4:00 AM ISTదర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. మూవీ బాక్సాఫీస్ స్టామినాపై జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆ సినిమా డైరెక్టర్ తోపాటు మెయిన్ క్యాస్టింగ్ కెరీర్ రికార్డులు బ్రేక్ చేస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతున్న ఆ చిత్రాన్ని రాజమౌళి తన కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇంటర్నేషనల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత ప్రియాంక ఇండియన్ సినిమాలో నటిస్తుండటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
మరోవైపు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ లో కనిపించనున్నారు. అయితే సినిమా బడ్జెట్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతున్న ఆ ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో వసూళ్లు సాధించాలనే టార్గెట్ తో మూవీ టీమ్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వారణాసికి సంబంధించిన చర్చల్లో ప్రధానంగా ఒక క్వశ్చన్ వినిపిస్తోంది. అదే ఆ సినిమా మెయిన్ టీమ్ మెంబర్స్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల రికార్డులను ఇది బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న. మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రూ.220 కోట్లతో నిలిచింది. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నది పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్ట్ కావడంతో వారణాసి ఆ రికార్డును ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.
అదే విధంగా ప్రియాంక చోప్రా కెరీర్ లో క్రిష్ 3 (రూ.390 కోట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విషయంలో సలార్ (రూ.617 కోట్లు) టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే వారణాసిపై ఉన్న అంచనాలు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళికి ఉన్న గుర్తింపు దృష్ట్యా ఆ ఇద్దరి కెరీర్స్ లో కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసలు ఆసక్తికరమైన విషయం రాజమౌళి రికార్డు గురించే.
ఆయన కెరీర్ లో ఇప్పటికీ బాహుబలి 2 రూ.1800 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొనసాగుతోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ సినిమా వసూళ్లను డామినేట్ చేయడం చిన్న విషయం కాదు. వారణాసి ఆ రేంజ్ ను దాటాలంటే ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయాల్సి ఉంటుంది. అయినా సరే, రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు గ్లోబల్ లాంచ్, భారీ కాన్వాస్, ఇంటర్నేషనల్ ప్రమోషన్ వంటి ఎలిమెంట్స్ కలిసి వస్తే వారణాసి బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఏదేమైనా విడుదలకు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఆ చిత్రం అప్పుడే రికార్డుల చర్చలు ప్రారంభించడం గమనార్హం.
