'బాహుబలి' కంటే ముందే మహేష్ కి ప్రామిస్!
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలన్నది ప్రతీ స్టార్ హీరో కి ఓ డ్రీమ్ లాంటింది.
By: Srikanth Kontham | 25 Oct 2025 4:00 AM ISTదర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలన్నది ప్రతీ స్టార్ హీరో కి ఓ డ్రీమ్ లాంటింది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి పాన్ ఇండియా విజయాల తర్వాత జక్కన్న క్రేజ్ రెట్టింపు అయింది. అప్పటి నుంచి బాలీవుడ్ సహా కోలీవుడ్ స్టార్లు సైతం రాజమౌళి కోసం క్యూలో ఉన్నారు. దీంతో ఇప్పుడీ హీరోల ఆప్షన్ అన్నది రాజమౌళి చేతుల్లోకి వెళ్లింది. ఏ హీరోతో సినిమా చేయాలన్నది జక్కన్న తీసుకోవాల్సిన నిర్ణయంగా మారింది. అంతమంది హీరోలు క్యూలో ఉన్నా రాజమౌళి ఆప్షన్ గా మహేష్ మాత్రమే కావడంతో ముందుగా ఆయనతో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
రాజమౌళి మైండ్ లో రన్నింగ్ హీరో:
ప్రస్తుతం ఇద్దరి కాంబినేషన్ లో గ్లోబల్ స్థాయిలో ఓ సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయని భారీ అంచనాలున్నాయి. మహేష్ తో రాజమౌళి తప్పక ఓ సినిమా చేస్తాడని అంతా ముందే గెస్ చేసారు. కానీ తనతో సినిమా తీయాలని రాజమౌళిని మహేష్ ఇప్పుడు కాదు `బాహుబలి` కంటే ముందుగానే కోరినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుసగా రాజమౌళి పాన్ ఇండియా విజయాలు అందుకోక ముందే కలిసి సినిమా చేద్దామని జక్కన్నని అడగగా ఆయన తప్పకుండా అని ప్రామిస్ చేసారుట.
తల్లిదండ్రుల ప్లానింగ్ ఇది:
కానీ రాజమౌళి మహేష్ తో సినిమా తీయడానికి ముందే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తీయాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్రకారం ప్రభాస్ తో తొలి పాన్ ఇండియా సినిమా `బాహుబలి` చేసారు. అటుపై ఎన్టీఆర్, చరణ్ తో `ఆర్ ఆర్ ఆర్` తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. ఆ ముగ్గురి తర్వాత మహేష్ తో సినిమా తీయడానికి ఇది సరైన సమయంగా భావించి మహేష్ ని లైన్ లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక అన్నది కేవలం రాజమౌళిది మాత్రమే కాదు. వెనుక స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా కీలక పాత్రధారి అన్నది గుర్తించాలి.
కాదనలేని నిజమది:
రాజమౌళి నేడు పాన్ ఇండియాలోఓ సంచలనంగా వెలుగుతున్నారంటే? అసలు కారకుడు డాడ్ విజయేంద్ర ప్రసాద్. ఆయన రాసిచ్చిన కథలకే రాజమౌళి దృశ్యరూపం ఇచ్చారు. ఏ సమయంలో ఎలాంటి కథను తెరకెక్కించాలని బ్యాకెండ్ లో డాడ్ సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ ప్రకారం రాజమౌళి ముందుకు వెళ్లడంతోనే అంత గొప్ప డైరెక్టర్ అవ్వగలిగారు. ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ లను పాన్ ఇండియాలో లాంచ్ చేస్తే మహేష్ ని ఏకంగా అంతర్జాతీయ మార్కెట్ కి కనెక్ట్ చేస్తూ ఎస్ ఎస్ ఎంబీ 29ని పట్టాలెక్కించారు. ఈ చిత్రాన్ని ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ తో చేస్తే ఆ రేంజ్ సినిమా చేయాలనే ఇంతకాలం జక్కన్న వెయిట్ చేసారు? అన్నది కాదనలేని వాస్తవం.
