SSMB29: ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్‌కు జక్కన్న సర్‌ప్రైజ్!
"మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు?" ఈ ఒక్క ప్రశ్న ఎస్.ఎస్. రాజమౌళిని దశాబ్ద కాలంగా వెంటాడుతూనే ఉంది.
By: M Prashanth | 5 Nov 2025 9:47 PM IST"మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు?" ఈ ఒక్క ప్రశ్న ఎస్.ఎస్. రాజమౌళిని దశాబ్ద కాలంగా వెంటాడుతూనే ఉంది. ప్రతీ ఈవెంట్‌లో, ప్రతీ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఇది. ఇన్నాళ్లకు ఆ కలల కాంబినేషన్ సెట్ అయింది, సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ, జక్కన్న సినిమా అంటే ప్రతీది ఒక మిస్టరీనే. అసలు కథేంటి? మహేష్ ఎలా కనిపించబోతున్నాడు? టైటిల్ ఏంటి? ఇలా వంద ప్రశ్నలు.
ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇది కౌబాయ్ ఫిల్మా? జేమ్స్ బాండ్ స్టైల్ మూవీనా? లేక అల్లూరి సీతారామరాజు కథా? అంటూ జక్కన్నే పాత ఈవెంట్లలో ఫ్యాన్స్‌ను ఊరించారు. ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరదించే సమయం వచ్చినట్లుంది. "ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఒక రివీల్" అంటూ మేకర్స్ పెద్ద ప్లాన్ సెట్ చేశారు.
ఆ భారీ మూమెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. రాజమౌళి తనయుడు, ఎస్.ఎస్. కార్తికేయ తాజాగా సోషల్ మీడియాలో ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. "ఈ గొప్ప క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తెలుగు సినిమా గుండెకాయ లాంటి రామోజీ ఫిల్మ్ సిటీ కంటే మంచి ప్రదేశం ఏముంటుంది?" అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.
నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో "#GlobeTrotterEvent" పేరుతో ఒక భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది కేవలం ఒక ప్రెస్ మీట్ కాదు, ఫ్యాన్స్ మధ్య జరగబోయే ఒక పెద్ద సెలబ్రేషన్. ఈ ఈవెంట్ నవంబర్ 15న సాయంత్రం 6 గంటల నుంచి మొదలవుతుందని, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుందని తెలిపారు.
ఈ ఈవెంట్‌లో ఏం రివీల్ చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. అనౌన్స్‌మెంట్ వీడియోలో ఒక రుద్రాక్ష మాల, త్రిశూలం, నంది ఉన్న లాకెట్‌ను చూపించారు. ఇది చూస్తుంటే, ఈ అడ్వెంచర్ స్టోరీకి ఏదో బలమైన మైథలాజికల్ టచ్, ముఖ్యంగా శివుడికి సంబంధించిన కనెక్షన్ ఉండబోతోందని గట్టిగా హింట్ ఇచ్చారు. ఇది సినిమా టైటిల్ రివీల్ ఈవెంటా? లేక ఫస్ట్ గ్లింప్సా? అనేది తెలియక ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక SSMB29 ప్రయాణంలో ఇది తొలి అడుగు. 'RRR' తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు హై లెవెల్లో ఉన్నాయి. నవంబర్ 15న జక్కన్న ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడో, ఆ "నెవర్ సీన్ బిఫోర్ రివీల్" ఏమై ఉంటుందో చూడాలి.
