మొత్తానికి రాజమౌళి కూడా త్వరపడుతున్నారా?
`మహాభారతం` అన్నది అతి పెద్ద సబ్జెక్ట్ కావడంతో స్క్రిప్ట్ సహా మిగతా పనులు పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుందని ముందే ప్రకటించారు.
By: Srikanth Kontham | 3 Nov 2025 2:05 PM ISTబాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ `మహాభారతం` పట్టాలెక్కించడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టారు. అమీర్ తన టీమ్ తో ఖాళీ సమయంలో స్క్రిప్ట్ పనుల్లో బిజీ అవుతున్నారు.
`మహాభారతం` అన్నది అతి పెద్ద సబ్జెక్ట్ కావడంతో స్క్రిప్ట్ సహా మిగతా పనులు పూర్తవ్వడానికి చాలా సమయం పడుతుందని ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్లు ప్రణాళిక సిద్దం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా సమయాన్ని `మహాభారతం` కోసమే కేటాయించుకుండా ఓవైపు సినిమాలు చేస్తూనే రచనలో భాగమవుతున్నారు.
లీక్ చేసిన మహేష్:
సిరీస్ గా మొదలయ్యే ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. `మహాభారతం` అన్నది అమీర్ 30 ఏళ్ల కలకు ఇంకెంతో సమయం పట్టదు. మరి అమీర్ ఖాన్ స్పీడ్ చూసిన దర్శకధీరుడు రాజమౌళి కూడా వేగం పెంచారా? అంటే అవుననే తెలుస్తోంది. తాజాగా రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ మధ్య జరిగిన చాటింగ్ ద్వారా ఈ విషయం బట్ట బయలైంది. మహేష్ ని రాజమౌళి ఏ సినిమాకు రివ్యూ ఇద్దామనుకుంటున్నావ్? అని అడిగితే `మీ కలల ప్రాజెక్ట్ మహా భారతంకు ఇవ్వాలనుకుంటున్నా.
జక్కన్న మహాభారతం మొదలైందా:
నవంబర్ లో అప్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. దయచేసి ఆ మాట నిలబెట్టుకోండి అన్నారు. దానికి రాజమౌళి `ఇప్పుడే కదా మహేష్ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఇద్దామని బధులిచ్చారు`. ఈ సమాధానంతో రాజమౌళి `మహాభారతం` మొదలైందని విషయం బయటకు వచ్చేసింది. `మహా భారతం` తీయడానికి తనుకున్న ఈ అనుభవం సరిపోదని ఇంకా చాలా సమయం పడుతుందని రాజమౌళి గతంలో అన్నారు.
అదే రాజమౌళి ధీమా:
దీంతో ఆ సినిమా చేయడానికి ఇంకా ఐదారేళ్లు అయినా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ రాజమౌళి మాత్రం సైలెంట్ గా `మహాభారతం` పనులు మొదలు పెట్టారని తేలింది. `మహా భారతం` స్టోరీ సిద్దం చేసేది స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈ నేపథ్యంలో ఆయన చాలా కాలంగానే ఈ ప్రాజెక్ట్ పని మొదలు పెట్టి ఉండొచ్చు. స్క్రిప్ట్ కి సంబధించి పనులు కూడా పూర్తయి ఉండొచ్చు. అందుకే మహేష్ కి అంత ధీమాగా రాజమౌళి నవంబర్ లో అప్ డేట్ ఇద్దామని ఉంటారు.
