Begin typing your search above and press return to search.

మహాభారతం కోసం రాజమౌళి భారీ ప్లాన్ వేశాడుగా...

తెలుగు సినిమా దశాదిశా మార్చిన దర్శకుడు రాజమౌళి...ఆయన ఎప్పుడైతే 'బాహుబలి' సినిమాని తీశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిపోయింది.

By:  Gopi Velupala   |   3 Oct 2026 9:35 AM IST
మహాభారతం కోసం రాజమౌళి భారీ ప్లాన్ వేశాడుగా...
X

తెలుగు సినిమా దశాదిశా మార్చిన దర్శకుడు రాజమౌళి...ఆయన ఎప్పుడైతే 'బాహుబలి' సినిమాని తీశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిపోయింది. మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. బాహుబలి తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను పెట్టి చేసిన 'త్రిబుల్ ఆర్' సినిమాతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయిపోయే స్థాయికి మన ఇండస్ట్రీ వెళ్ళిపోయింది...ప్రస్తుతం ఏ డైరెక్టర్ ఎంత పెద్ద సినిమా చేసినా కూడా పాన్ ఇండియా సినిమాలకు ఊపిరి పోసిన దర్శకుడు మాత్రం రాజమౌళి... ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. 2027 ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడా కూడా సినిమా అవుట్ పుట్ కి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం షూటింగ్ చేయడమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా చాలా వేగవంతం చేస్తున్నాడు. ఎప్పుడైతే షెడ్యూల్ అయిపోతుందో ఆ వెంటనే దానికి సంబంధించిన వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకునే పనిలో రాజమౌళి ఉన్నాడు. ఎక్కడ తను ఒక్క నిమిషం కూడా బ్రేక్ ఇవ్వకుండా సినిమా పనుల మీదనే పూర్తి టైమ్ ను కేటాయిస్తున్నాడు. యావత్ తెలుగు సినిమా పరిశ్రమలో హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా 'వారణాసి'... రాజమౌళి నార్మల్ సినిమాల మీదనే చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తుంటాడు. అలాంటిది వారణాసి లాంటి ప్రస్టేజియస్ మూవీ కోసం ఆయన ఎంతలా కష్టపడుతాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతనికి సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. కాబట్టి ఆయన సినిమా మీదనే ఫోకస్ చేస్తుంటాడు.

మహాభారతం ప్లాన్...

ప్రస్తుతం రాజమౌళి ఒక సినిమా కోసం దాదాపు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికైతే ఆయన సక్సెస్ లో పర్సంటేజ్ తీసుకుంటాడు. ఆయన సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఆయనకు 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తనకి వచ్చే రెమ్యూనరేషన్ ను పూర్తిగా కూడబెడుతున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే తన డ్రీమ్ ప్రాజెక్టుగా చెబుతున్న 'మహాభారతం' సినిమాకి రాజమౌళి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కొనసాగాలనే ప్రయత్నం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహాభారతం సిరీస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దానిని చాలా పార్టులుగా చేయాల్సిన అవసరమైతే ఉంది. దాని కోసం చాలామంది ప్రొడ్యూసర్లు కావాలి.

ఇక అందులో రాజమౌళి కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా మారుదాం అనే ప్రయత్నాలైతే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తే మాత్రం అదొక మాస్టర్ పీస్ గా నిలుస్తుందని ప్రపంచ స్థాయి ప్రేక్షకులు సైతం ఆ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి ని మహాభారతం సినిమా ఎప్పుడు చేస్తారని అడిగిన ప్రతిసారి ఆ సినిమాని చేయడానికి ప్రస్తుతం తనకున్న అనుభవం సరిపోదని చెబుతున్నాడు. అలాగే నా కెరీర్లో తప్పకుండా మహాభారతాన్ని సినిమా గా చేస్తానంటూ ఆయన చెప్పిన మాటలు ప్రతిక్షణం ప్రేక్షకులకు వినిపిస్తూనే ఉన్నాయి. రాజమౌళి నోటి నుంచి మహాభారతం సినిమా అనౌన్స్ మెంట్ వస్తే చూడాలని అభిమానులు వేయికన్నులతో ఎదురు చూస్తున్నారు...రాజమౌళి ఒక ప్రాజెక్ట్ మీద ఉన్నప్పుడు మరో కథ గురించి డిస్కస్ చేయడు. కాబట్టి ఇప్పుడు తన పూర్తి ఫోకస్ వారణాసి మీదనే ఉంది... ఈ మూవీ తర్వాత మహాభారతం చేస్తాడేమో చూడాలి...