Begin typing your search above and press return to search.

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'లో కృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, దుర్యోధనుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై రాజమౌళి లేదా ఆయన టీమ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో 'వారణాసి' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

By:  Gopi Velupala   |   6 Nov 2026 12:00 AM IST
రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి... ప్రస్తుతం ఆయన మహేష్ బాబు తో 'వారణాసి' సినిమా చేస్తున్నాడు. ఆయన ఎన్ని ప్రాజెక్టులు చేసిన తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'మహాభారతం' సినిమా చేయడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఏ సినిమా చేసినా కూడా బ్యాక్ ఎండ్ లో మహాభారతం సినిమాకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతూనే వస్తున్నాయి... మహాభారతంలో కీలక పాత్రలైన కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడి పాత్రల్లో టాలీవుడ్ టాప్ హీరో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

ఆ మూడు పాత్రలు చేసేది ఈ ముగ్గురు స్టార్ హీరోలేనా?

మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడి పాత్రల చుట్టూనే కథ నడుస్తుందనే విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కృష్ణుడి పాత్రలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్జునుడి గా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దుర్యోధనుడిగా కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురు అగ్ర హీరోలు రాజమౌళి దర్శకత్వంలో కలిసి నటిస్తే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుతాయని, పాన్ వరల్డ్ స్థాయిలో భారీ బజ్ క్రియేట్ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు...

వాస్తవ పరిస్థితి ఏమిటి?

ఈ వార్తలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే సినీ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చలే, రాజమౌళి గాని ఆయన టీం గాని ఎవరూ కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం రాజమౌళి వారణాసి పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేలా అత్యంత భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు...

మహాభారతం పట్టలెక్కేది అప్పుడేనా?

రాజమౌళి గతంలో పలుమార్లు సోషల్ మీడియాతో మాట్లాడుతూ మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్.. కాబట్టి దానిని తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుందని స్పష్టంగా తెలియజేశారు. దీనికోసం ప్రత్యేకమైన పరిశోధన భారీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఇప్పట్లో ఈ మూవీ పట్టలెక్కే అవకాశం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న కథనాలన్నీ కేవలం అభిమానుల అంచనాలు మాత్రమే...రాజమౌళి నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఈ ప్రాజెక్టు క్యాస్టింగ్ పై స్పష్టత వచ్చే అవకాశం లేదు...