Begin typing your search above and press return to search.

జక్కన్నపై కపిల్ స్కిట్.. అంత అవసరమా?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ తో ఇప్పుడు బిజీగా ఉన్నారు.

By:  M Prashanth   |   22 Dec 2025 3:01 PM IST
జక్కన్నపై కపిల్ స్కిట్.. అంత అవసరమా?
X

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ మూవీ షూటింగ్ తో ఇప్పుడు బిజీగా ఉన్నారు. వరుసగా షెడ్యూల్స్ ను పూర్తి చేస్తూ దూసుకుపోతున్నారు. వచ్చే ఏడాది చివరకు మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలని చూస్తున్నారు.

వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో నటిస్తుండగా.. రుద్ర పాత్రలో కనిపించనున్నారు. కొన్ని సీన్స్ లో రాముడిగా సందడి చేయనున్నారు. అదే సమయంలో ఫిమేల్ లీడ్ రోల్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా యాక్ట్ చేస్తున్నారు. మందాకినిగా ఆమె నటిస్తున్నట్లు ఇప్పటికే జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక.. రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారమయ్యే ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో సందడి చేశారు. కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేస్తున్న ఆ షోలో ప్రియాంక వివిధ విషయాలపై మాట్లాడారు. ఆ సమయంలో రాజమౌళిపై కపిల్ స్కిట్ చేయించడం వివాదాస్పదంగా మారింది.

భారీ బడ్జెట్, వీఎఫ్‌ఎక్స్ తో రూపొందే సినిమాలపై ఎప్పుడూ కామెంట్స్ చేసే కపిల్.. ఇప్పుడు రాజమౌళి విషయంలో స్పూఫ్ రోల్ ను రాజా గోలి అంటూ ఓ రోల్ ను తీసుకొచ్చారు. అందులో ఆ రాజా గోలి పాత్ర ప్రియాంక మెడలో ఆకుపచ్చ క్యాలీఫ్లవర్‌లతో చేసిన దండను వేశారు. అంతటితో ఆగకుండా.. పలు వ్యాఖ్యలు చేశారు.

ఆ కాలీఫ్లవర్ల దండను వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించి వజ్రాల మాలగా మారుస్తానని తెలిపారు. ఇది కామెడీ కోసమే ఉద్దేశించినప్పటికీ.. ఆ జోక్ రాజమౌళి అభిమానులకు మాత్రం నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. అది కామెడీ రూపంలో చేసిన ఎగతాళి అని, అలా చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు.

రాజమౌళి విజన్ ను పదే పదే ఎగతాళి చేయడం.. బాహుబలి, RRR వంటి చిత్రాల ద్వారా ఆయన భారతీయ సినిమాకు తీసుకువచ్చిన ప్రపంచవ్యాప్త గుర్తింపును ఎగతాళి చేయడం వంటిదేనని మండిపడుతున్నారు. చేసిన కామెడీ కూడా.. జక్కన్న చేస్తున్న సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ముందు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

కామెడీ చేయొచ్చని.. ఆడియన్స్ ను నవ్విచొచ్చని, కానీ అతిగా చేయడం అవసరం లేదని హితవు పలుకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు జరిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. జోకులు.. నవ్వించేలా ఉండాలని.. అలా బాధపెట్టేలా ఉండకూడదని సూచిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.