Begin typing your search above and press return to search.

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

తెలుగు సినిమా ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్స్ తో గ్లోబల్ స్థాయిలో దూసుకెళ్తుంది. దశాబ్దాలుగా మన స్టార్ డైరెక్టర్లు తమదైన సృజనాత్మకత తో అద్భుతమైన విజయాలను ఖాతాలో వేసుకుంటూ వచ్చారు.

By:  Gopi Velupala   |   4 Nov 2026 11:00 PM IST
రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...
X

తెలుగు సినిమా ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్స్ తో గ్లోబల్ స్థాయిలో దూసుకెళ్తుంది. దశాబ్దాలుగా మన స్టార్ డైరెక్టర్లు తమదైన సృజనాత్మకత తో అద్భుతమైన విజయాలను ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. ఒక దశలో తెలుగులో వైవిధ్యమైన కథలు రావు, కేవలం మూస ధోరణి కమర్షియల్ సినిమాలే వస్తాయనే విమర్శలు ఇతర పరిశ్రమల నుంచి ఎదురయ్యాయి. ఆ విమర్శలను తిప్పికొడుతూ మన దర్శకులు కమర్షియల్ ఫార్మాట్ లోనే కనీ విని ఎరుగని రీతిలో సీన్లు డిజైన్ చేయడం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంటర్వెల్ బ్యాంగ్...

ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉండాలి...

ఒకప్పుడు సినిమా ఫ్లో కి తగ్గట్టుగా ఇంటర్వెల్ సీన్స్ ను డిజైన్ చేస్తూ ఉండేవారు. కానీ మారుతున్న ప్రేక్షకుడి అభిరుచి మేరకు వాళ్ళకి హై పీక్ ఎలిమెంట్ ఇస్తేనే ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అలాగే ఇంటర్వెల్ లో బయటికి వెళ్లి 10 నిమిషాలు రిఫ్రెష్ అయ్యి వచ్చినా ప్రేక్షకుడికి సెండాఫ్ లో ఏం జరగబోతోంది? అనే ఒక క్యూరియాసిటి ఆడియన్స్ ను కూర్చోబెడుతుంది.

ఈ సక్సెస్ ఫార్ములాను టాలీవుడ్ లో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి కే దక్కుతుంది. ఆయన సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తను తొలి చిత్రం 'స్టూడెంట్ నెంబర్ వన్' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు ప్రతి సినిమాలో మనకు ఒక సపరేట్ ఇంటర్వెల్ బ్యాంగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా సింహాద్రి, చత్రపతి, విక్రమార్కుడు, మగధీర లాంటి సినిమాల్లో ఇంటర్వెల్ సీన్లు తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప సన్నివేశాలుగా నిలిచిపోయాయి.

రాజమౌళి మార్క్ ఇంటర్వెల్స్...

రాజమౌళి వచ్చిన తర్వాతే ఇంటర్వెల్ బ్లాక్ కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్, క్రేజ్ ఏర్పడ్డాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఆయన ఒక ఎమోషన్ ను స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వస్తారు. సరిగ్గా విశ్రాంతి సమయానికి ముందు ఆ ఎమోషన్ ను యాక్షన్ ఎపిసోడ్ తో మిళితం చేసి ప్రేక్షకుడిని సీట్ ఎడ్జ్ లో కూర్చునేలా ప్లాన్ చేస్తాడు. కథలోని కోర్ ఎమోషన్, పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ఇంటర్వెల్ దగ్గర పీక్స్ కి తీసుకెళ్ళి ప్రేక్షకుడి లో భారీ ఎమోషన్ ను కలిగించి ఇంటర్వెల్ బ్రేక్ ఇవ్వడం రాజమౌళి స్టైల్...

నేటి తరం దర్శకులు ఫాలో అవుతున్నారా.

ప్రస్తుతం ఉన్న ఫిలిం మేకర్స్ అందరు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా పకడ్బందీగా డిజైన్ చేసుకుంటున్నారు. ఆ ఒక్కటి కనుక పర్ఫెక్ట్ గా పేలుతే నెక్స్ట్ సెకండాఫ్ మీద ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ పెరుగుతుందని ఒకవేళ అది హై ఇవ్వకపోతే చాలామంది ఆడియన్స్ ఇంటర్వెల్ నుంచి బయటికి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇంటర్వెల్ ని చాలా బాగా డిజైన్ చేసుకుంటున్నారు...