Begin typing your search above and press return to search.

ఏం జరిగినా సరే.. రాజమౌళి చేసేది చేస్తాడంతే..?

వారణాసి గ్లింప్స్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ పై అటు రాజకీయ నాయకులతో పాటు హిందూ ధర్మ కర్తలు కొందరు ఆయన మీద ఫైర్ అవుతున్నారు.

By:  Ramesh Boddu   |   21 Nov 2025 11:43 AM IST
ఏం జరిగినా సరే.. రాజమౌళి చేసేది చేస్తాడంతే..?
X

వారణాసి గ్లింప్స్ ఈవెంట్ లో రాజమౌళి చేసిన కామెంట్స్ పై అటు రాజకీయ నాయకులతో పాటు హిందూ ధర్మ కర్తలు కొందరు ఆయన మీద ఫైర్ అవుతున్నారు. రాజమౌళి ఏ సినిమా విషయంలో ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ ఫేస్ చేయలేదు. ప్రతి సినిమా విషయంలో రాజమౌళి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంటాడు. ఆర్.ఆర్.ఆర్ లో కూడా కొమరం భీమ్ రోల్ ముందు పోస్టర్ తో కాస్త ట్రోల్స్ జరగ్గా.. దాన్ని ఆయన కవర్ చేసిన విధానం ఇంప్రెస్ చేసింది. అంతేకాదు రామరాజు, భీమ్ కలవడం లాంటి సన్నివేషాలు కూడా ఆడియన్స్ ని కన్విన్స్ చేశాయి.

వాటికి రాజమౌళి ఎప్పుడూ సిద్ధమే..

ఐతే వారణాసి సినిమా జస్ట్ గ్లింప్స్ రిలీజ్ టైంలోనే ఈ రేంజ్ ట్రోల్స్ రాజమౌళి అసలు ఊహించి ఉండదు. ఐతే ఈ ఇష్యూపై రాజమౌళి ఏం ఆలోచిస్తున్నాడు అన్నది స్పష్టంగా తెలియట్లేదు కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది ఏంటంటే.. ఈ ట్రోల్స్, నెగిటివిటీ ఇప్పటివరకు చూడకపోయినా వాటికి రాజమౌళి ఎప్పుడూ సిద్ధమే అనేలా ఉన్నాడని తెలుస్తుంది. ఏమి లేకపోయినా సరే ఏదో ఊహించేసుకుని ట్రోల్ చేసే బ్యాచ్ గురించి రాజమౌళికి తెలుసు. ఆయన స్వయంగా ట్రోల్స్ ఫేస్ చేయకపోయినా సరే ఆ ఫీల్ ని అనుభూతి పొందగలడు. అందుకే ఈ ట్రోల్స్, నెగిటివిటీ పై రాజమౌళి స్పందించట్లేదు.

ఐతే జక్కన్న ఓ పక్క వారణాసి సినిమాపై ఈ రేంజ్ లో ఇష్యూ నడుస్తున్నా సరే ఎంచక్కా తను మాత్రం వారణాసి లీడ్ కాస్ట్ తో పమోషన్స్ మొదలు పెట్టాడు. రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు డైరెక్ట్ ఎక్స్ పీరియన్స్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హాలీవుడ్ మీడియాకు ముందు ఇంటర్వ్యూస్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రా జోనస్, పృధ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్వ్యూస్ పూర్తయ్యాయట.

ఇంటర్నేషాల్ ప్రమోషన్స్ షెడ్యూల్ ప్లాన్..

సో వారణాసి ఈవెంట్ లో అలా జరిగిందని కాదు.. సినిమా రిలీజ్ టైం లో కూడా ఎలాంటి నెగిటివ్ ట్రోల్స్ వచ్చినా కూడా రాజమౌలి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడని అర్ధమవుతుంది. సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న కార్తికేయ ఈ ఇంటర్నేషాల్ ప్రమోషన్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. సో వారణాసి సినిమా విషయంలో బయట కేవలం రాజమౌళి కామెంట్స్ మిగతా నెగిటివిటీనే చూస్తున్నారు కానీ వెనక రాజమౌళి తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది.

మహేష్ బాబు కూడా ఈ సినిమాతో పాన్ వరల్డ్ అటెంప్ట్ చేయబోతున్నాడు. వారణాసి గ్లింప్స్ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అయ్యారు. వారణాసి సినిమాను రాజమౌళి 2027 సమ్మర్ కి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. మరి అనుకున్న విధంగా ఈ సినిమా ఆ టైంకి వస్తుందా లేదా అన్నది చూడాలి.