గ్లోబ్ ట్రాటర్ పాస్‌లు కావు.. పాస్‌పోర్ట్‌లు!
By: M Prashanth | 13 Nov 2025 11:56 PM ISTరాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కోసం సోషల్ మీడియా మొత్తం దద్దరిల్లిపోతోంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ఈ విజువల్ వండర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రీసెంట్ పోలీస్ రూల్స్ వల్ల ఇది ఓపెన్ ఈవెంట్ కాదని, ఎంట్రీ చాలా పరిమితంగా ఉంటుందని రాజమౌళే స్వయంగా చెప్పారు. దీంతో అందరిలోనూ ఒకటే టెన్షన్.. "అసలు ఈ ఈవెంట్‌కి ఎంట్రీ ఎలా?" అని.
సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లకు 'ఎంట్రీ పాస్‌లు' ఉంటాయి. వాటి కోసం ఫ్యాన్స్ అందరూ వెతకడం మొదలుపెట్టారు. కానీ టీమ్ చాలా తక్కువ మందికి లిమిటెడ్ లోనే ఇన్విటేషన్స్ ఇస్తోంది. ఇక జక్కన్న టీమ్ నుంచి బయట హడావుడిగా ఎక్కడా 'పాస్' అనే మాట పెద్దగా వినిపించడం లేదు. ఎందుకంటే, రాజమౌళి ఈసారి 'పాస్' సిస్టమ్‌నే పూర్తిగా పక్కన పెట్టేశారు. దానికి బదులుగా, ఆయన తన సినిమా స్టైల్‌లోనే ఒక కొత్తరకం ఇన్విటేషన్‌ను పరిచయం చేశారు.
'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌కు ఎంట్రీ కోసం జక్కన్న టీమ్ పాస్‌పోర్ట్ లను జారీ చేస్తోంది. ఇది మన ప్రభుత్వం ఇచ్చే నిజమైన ప్రయాణ పాస్‌పోర్ట్ కాదు. ఇది కేవలం ఆ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన థీమ్డ్ ఎంట్రీ పాస్. సినిమా కాన్సెప్ట్ 'గ్లోబ్ ట్రాటర్' (ప్రపంచ యాత్రికుడు) కాబట్టి, ఆ థీమ్‌కు తగ్గట్టుగా పాస్‌ను 'పాస్‌పోర్ట్' రూపంలో డిజైన్ చేశారు.
ఈ క్రియేటివ్ పాస్‌పోర్ట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు అట్టతో, చూడటానికి అచ్చం అసలైన పాస్‌పోర్ట్‌లాగే కనిపిస్తోంది. దానిపై "GLOBETROTTER EVENT" అని, "PASSPORT" అని స్పష్టంగా ముద్రించి ఉంది. లోపల తెరిచి చూస్తే, ఈవెంట్ వివరాలు, మహేష్ బాబు సినిమా లుక్ కూడా కనిపిస్తున్నాయి. ఈ కొత్త ఐడియా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ ఐడియా వెనుక కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు, పక్కా స్ట్రాటజీ కూడా ఉంది. పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా క్రౌడ్‌ను కంట్రోల్ చేయాలని, పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాలని సూచించారు. దీంతో, రాజమౌళి ఆ సింపుల్ పోలీస్ రూల్‌ను కూడా తన సినిమా ప్రమోషన్‌కు అద్భుతంగా వాడుకున్నారు. 'పాస్‌పోర్ట్' అనడం వల్ల దానికి ఒక స్పెషల్ వాల్యూ, థీమ్ యాడ్ అయ్యింది.
