Begin typing your search above and press return to search.

గ్లోబ్ ట్రోటర్.. అప్పుడే 20 కోట్లు లాభం.. సూపర్ జక్కన్న!

నిజానికి సినిమా ఈవెంట్ ల వల్ల ఆయా సినిమాలకు ప్రమోషన్ జరుగుతుంది అని మనందరికీ తెలుసు. కానీ సినీ చరిత్రలో తొలిసారి ఇలా ఈవెంట్ల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చని జక్కన్న నిరూపించారు.

By:  Madhu Reddy   |   13 Nov 2025 12:17 PM IST
గ్లోబ్ ట్రోటర్.. అప్పుడే 20 కోట్లు లాభం.. సూపర్ జక్కన్న!
X

సాధారణంగా ఒక సినిమా విడుదలవుతోంది అంటే.. కచ్చితంగా ఆ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. పైగా ఆ సినిమాను ఎంత పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే అంతగా రీచ్ అవుతుంది. సినిమా కంటెంట్ బాగుంటే కలెక్షన్లు కూడా అదే రేంజిలో వస్తాయి అనడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా క్యాష్ చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు రాజమౌళి. ఇక రాజమౌళి ఆలోచనలకు , ఆయన కమర్షియల్ మైండ్ కి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి సినిమా ఈవెంట్ ల వల్ల ఆయా సినిమాలకు ప్రమోషన్ జరుగుతుంది అని మనందరికీ తెలుసు. కానీ సినీ చరిత్రలో తొలిసారి ఇలా ఈవెంట్ల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చని జక్కన్న నిరూపించారు. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఇంకో రెండేళ్లు ఈ సినిమా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. దీనితో సినిమాను మరిచిపోయే అవకాశం ప్రేక్షకులలో ఎంతైనా ఉంది అనే ఆలోచన చేశారేమో తెలియదు కానీ అందులో భాగంగానే అభిమానుల కోసం గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు రాజమౌళి.

అందులో భాగంగానే నవంబర్ 15వ తేదీన ఈ వేడుకను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా నిర్వహించనున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విషయంలోకి వెళ్తే గ్లోబ్ ట్రోటర్ అంటూ నిర్వహించనున్న ఈవెంట్ కి మీడియా వారు ఎవరికీ కూడా అనుమతి లేదని జక్కన్న కరాకండిగా చెప్పిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఆయన ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది.. ఇక ఈవెంట్ ని చూడాలి అంటే జియో హాట్ స్టార్ లో మాత్రమే సాధ్యమవుతుంది..

ఇకపోతే ఈవెంట్ కి 30 కోట్ల మేర ఖర్చు కాగా.. ఈ ఈవెంట్ హక్కులను రాజమౌళి జియో హాట్ స్టార్ కు వేగంగా 50 కోట్లకు అమ్మివేసినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈవెంట్ ని కూడా అమ్మేసి ఏకంగా 20 కోట్లు లాభాన్ని దక్కించుకున్నారు జక్కన్న అంటూ అభిమానులు ఆయన ఆలోచనలకు ఫిదా అవుతున్నారు. అందుకే నిర్మాతలకు లాభాలు చేకూర్చడంలో రాజమౌళి ఎప్పుడూ ముందుంటారని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈవెంట్ వేదికగా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు . ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా చీర కట్టులో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నట్టు ఉన్న పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. అలాగే రెండు రోజుల క్రితం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.