రాజమౌళి ప్లానింగ్ అంటే లెక్క ఇలానే ఉంటుందిగా..!
దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా సరే అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న గ్లోబ్ త్రొట్టర్ సినిమా హంగామా మొదలైంది.
By: Ramesh Boddu | 13 Nov 2025 9:59 AM ISTదర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా సరే అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి చేస్తున్న గ్లోబ్ త్రొట్టర్ సినిమా హంగామా మొదలైంది. ఈ నెల 15న సినిమాకు సంబంధించిన ఒక భారీ ఈవెంట్ హైదరాబాద్ రామోజి ఫిల్మ్ సిటీలో జరగబోతుంది. ఈ ఈవెంట్ ని జియో హాట్ స్టార్ లైవ్ ఇవ్వబోతుంది. ఈవెంట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఐతే ఈలోగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తున్నాడు రాజమౌళి.
మహేష్, రాజమౌళి ఎక్స్ లో చిట్ చాట్..
ముందు మహేష్, రాజమౌళి ఎక్స్ లో చిట్ చాట్ చేయడం.. అందులోనే ప్రియాంక చోప్రా జాయిన్ అవ్వడం ఆ నెక్స్ట్ పృథ్వీరాజ్ కూడా కలవడం ఇదంతా ఎక్స్ లో ట్రెండింగ్ అయ్యింది. ఇక పృధ్విరాజ్ కుంభ లుక్ ఫస్ట్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్ లుక్ అదిరిపోయింది. ఐతే ఆ ఫస్ట్ లుక్ ని కొంతమంది ఆడియన్స్ ట్రోల్ చేశారు. అది పక్కన పెడితే లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు రాజమౌళి.
దేశి గర్ల్ అంటూ ఎల్లో శారీలో యాక్షన్ పార్ట్ లో భాగంగా గన్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది ప్రియాంక చోప్రా. మామూలుగా ప్రియాంకా చోప్రా లుక్ ని వేరే విధంగా ఊహించేసుకున్న ఆడియన్స్ శారీలో కనిపించేసరికి సర్ ప్రైజ్ అయ్యారు. ఆమె రోల్ పేరు కూడా మందాకిని అని చెప్పి షాక్ ఇచ్చారు.
ఇక మిగిలి ఉంది మహేష్ లుక్కే.. అది మాత్రం గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ లో చూడాల్సిందే.. ఈ గ్యాప్ లో కీరవాణి రిలీజ్ చేసిన సంచారి గ్లోబ్ త్రొట్టర్ సాంగ్ ఫ్యాన్స్ కి బాగా ఎక్కేసింది. జస్ట్ ఆ సాంగ్ వింటూ కళ్లు మూసుకుని ఈ సాంగ్ రాజమౌళి టేకింగ్ లో మహేష్ మోంటేజ్ షాట్స్ ఎలా ఉంటాయా అని ఇమాజిన్ చేసుకుంటున్నారు.
నవంబర్ బ్లాస్ట్ లో భాగంగా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్..
SSMB 29 షూటింగ్ మొదలైనప్పటి నుంచి సైలెంట్ గా ఉండి నవంబర్ బ్లాస్ట్ లో భాగంగా రోజుకొక అప్డేట్ తో ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేస్తున్నాడు రాజమౌళి. ఇక 15న జరగబోతున్న ఈవెంట్ లో ఇంకెన్ని సర్ ప్రైజ్ లు ఇస్తాడో అనుకుంటున్నారు ఫ్యాన్స్. మహేష్ లుక్ తో పాటు గ్లోబ్ త్రొట్టర్ నుంచి ఒక గ్లింప్స్ వదిలితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
ఈ ఈవెంట్ తర్వాత ఇక డైరెక్ట్ గా రిలీజ్ టైం లో ప్రమోషన్స్ చాలు అనే రేంజ్ లో ఒక ఏడాది రెండేళ్లు గుర్తుండిపోయేలా గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. రాజమౌళి ప్లానింగ్ గురించి తెలిసినా కూడా మహేష్ SSMB 29 గ్లోబ్ త్రొట్టర్ ఈవెంట్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
