Begin typing your search above and press return to search.

రాజమౌళి మూవీలో హైలెట్ అయ్యే 5 క్రాఫ్ట్స్ ఇవే...

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆయన చేసిన ' బాహుబలి', 'త్రిబుల్ ఆర్' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచాయి.

By:  Gopi Velupala   |   2 Oct 2026 8:00 AM IST
రాజమౌళి మూవీలో హైలెట్ అయ్యే 5 క్రాఫ్ట్స్ ఇవే...
X

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. ఆయన చేసిన ' బాహుబలి', 'త్రిబుల్ ఆర్' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని పెంచాయి. రాజమౌళి ఎప్పుడైతే తన సినిమా అనౌన్స్మెంట్ ఇస్తాడో అప్పటినుంచి సినిమా అప్డేట్స్ ఇస్తూ ఆ మూవీ థియేటర్ లోకి ఎప్పుడూ వస్తుందా ఎప్పుడూ చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురుచూసేలా చేస్తాడు. ఇక రాజమౌళి తను చేయబోయే సినిమాల విషయంలో చాలా ప్రకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతుంటాడు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పించి హాలీవుడ్ మేకర్స్ కి సైతం గట్టి పోటీ ఇవ్వాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నాడు... అందుకోసమే ఈ సినిమా మీద ఏకంగా 1600 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అందులో కొన్ని ఎలిమెంట్స్ అయితే ప్రధానంగా ఉంటాయి. వాటి మీద ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అందులో మొదటగా 'స్క్రీన్ ప్లే - దర్శకత్వం ' మీద ఆయన చాలావరకు కసరత్తులు చేశాడు. ఒక సీన్ ఎలా ఉండాలి ఒక షాట్ లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది ప్రేక్షకుడికి పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుంది. సినిమాలోని సోల్ చెడిపోకుండా మనం విజువల్ గా దానిని ప్రేక్షకుడికి ఎలా చూపించాలి. స్క్రీన్ ప్లే లో ఏదైనా హైడ్ చేయాల్సిన విషయం ఉంటే దానిని ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేయాలనే విషయాలను చాలా పకడ్బందీగా రాసుకుంటాడు. అంతే ఎఫెక్టివ్ గా దానిని స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తాడు...

మ్యూజిక్

మ్యూజిక్ విషయంలో కూడా రాజమౌళి అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు. స్క్రీన్ మీద ప్రేక్షకులకు కనిపించే ప్రతి విజువల్ వాళ్ల మనసుకు చేరడంలో మ్యూజిక్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తుంది. నేపథ్య సంగీతం అనేది సినిమా యొక్క రూపురేఖల్ని మార్చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు... సినిమాలో వచ్చే ప్రతి సాంగ్ హైలెట్ గా నిలవాలని సినిమా మొత్తానికి ఆల్బమ్ సూపర్ సక్సెస్ అవ్వాలని ఆయన కోరుకుంటాడు. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కి చాలా వరకు కండిషన్లు పెడుతూ రాజమౌళి తనకి ఎలాంటి మ్యూజిక్ కావాలో చెప్పి దగ్గరుండి మరి తనే చేయించుకుంటాడు.

యాక్షన్ సీక్వెన్స్

రాజమౌళి సినిమాలో మనకు ప్రధానంగా కనిపించేవి పోరాట సన్నివేశాలు... యాక్షన్ కొరియోగ్రాఫర్ ఎవరైనా కూడా రాజమౌళి ఇన్స్ట్రక్షన్స్ ను ఫాలో అవుతూ యాక్షన్ సీన్స్ ను పర్ఫెక్ట్ గా చేసి పెట్టాలి. నిజానికి రాజమౌళి తన సినిమాలో స్టార్టింగ్ నుంచి ఒక ఎమోషన్ ను హోల్డ్ చేసి పట్టుకువస్తాడు. కాబట్టి అది ఒకేసారి బరస్ట్ అవుతుంది అలాంటి సిచువేషన్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో డిజైన్ చేస్తే అది ప్రేక్షకుడికి రీచ్ అవుతుందో రాజమౌళి కి బాగా తెలుసు అందుకే యాక్షన్ కొరియోగ్రాఫర్ తో దానిని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయిస్తాడు... ఉదాహరణకి 'ఛత్రపతి ' మూవీలో ఇంటర్వెల్ ఫైట్ ను చెప్పుకోవచ్చు. అప్పటి వరకు తన కోపాన్ని అణుచుకున్న హీరో ఇంటర్వెల్ లో కట్ రాజ్ తో చేసే ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

సినిమాటోగ్రఫీ

రాజమౌళి సినిమాలో సినిమాటోగ్రాఫర్ వర్క్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కంటికి కనిపించే ప్రతి విజువల్ ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇచ్చేలా ఉంటుంది. అలాంటప్పుడే ప్రేక్షకులు విజువల్ వండర్ ను చూడటానికి రిపీటెడ్ గా థియేటర్ కి వస్తారని రాజమౌళి బాగా నమ్ముతాడు. అందుకే సినిమాటోగ్రాఫర్ విషయంలో కూడా ఆయన చాలా కేర్ఫుల్ గా ఉంటాడు...

సీజీ

రాజమౌళి సిజీ వర్క్ ను ఎప్పుడు లైట్ తీసుకోడు. నిజానికి రాజమౌళి సినిమాల్లో కొన్ని సీజీ సన్నివేశాలను చూస్తే అది రియల్ గా షూట్ చేశారెమో అనేంత రియలెస్టిక్ గా ఉంటాయి. రాజమౌళి ఒక్కటే నమ్ముతాడు మనం స్క్రీన్ మీద చూపించే ప్రతి విషయం రియల్ గా జరుగుతుందని ప్రేక్షకుడిని నమ్మించాలి. ఆడియన్ ఎప్పుడైతే ఆ విజువల్స్ ను చూసి ఒక అనుభూతిని చెందుతాడో అప్పుడే ఆ సినిమాను అతను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతాడు. సిజీ వర్క్ అంత ఎఫెక్టివ్ గా లేకుండా తెలిసిపోయేలా ఉంటే ప్రేక్షకుడు ఆ సీన్స్ కి పెద్దగా కనెక్ట్ కాలేడు. అందుకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైతం ఎఫెక్టివ్ గా లేకపోయిన, విజువల్స్ ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించకపోయిన, స్క్రీన్ ప్లే లో కొత్తదనం లోపించిన, డైరెక్షన్ అంత ఎఫెక్టివ్ గా లేకపోయిన, యాక్షన్ సన్నివేశాలు ఎమోషన్ ను బ్యాలెన్స్ చేయకపోయిన కూడా ప్రేక్షకుడు సినిమా నుంచి డిస్కనెక్ట్ అవుతాడు. కాబట్టి ఈ ఐదింటి మీద రాజమౌళి చాలా స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమాను తెరకెక్కిస్తాడు...