Begin typing your search above and press return to search.

'బాహుబలి' ఫ్లాప్ అయితే ఆస్తి అమ్మేవాళ్లం.. రమా రాజమౌళి షాకింగ్ రివీల్!

ఈ డాక్యుమెంటరీలో రమా రాజమౌళి మాట్లాడుతూ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన మొదటి రోజు థియేటర్ల దగ్గర మిక్స్‌డ్ టాక్ కూడా రాలేదని, క్లియర్ నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పారు.

By:  Madhu Reddy   |   26 Jun 2026 10:50 PM IST
బాహుబలి ఫ్లాప్ అయితే ఆస్తి అమ్మేవాళ్లం.. రమా రాజమౌళి షాకింగ్ రివీల్!
X

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన అద్భుత దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ సినిమా వెనుక చిత్ర యూనిట్ పడ్డ కష్టాన్ని వివరిస్తూ నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన ‘బాహుబలి ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ సిరీస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇందులో రాజమౌళి భార్య రమా రాజమౌళి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ‘బాహుబలి 1’ విడుదలైన మొదటి రోజు విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చిందని, సినిమా ఫ్లాప్ అయితే నష్టాలు పూడ్చడానికి మణికొండలో ఉన్న తమ ఏకైక సైట్ అమ్మేయాలని డిసైడ్ అయ్యానని ఆమె గుర్తుచేసుకున్నారు..

నెట్‌ఫ్లిక్స్‌లో బాహుబలి తెరవెనుక కథ:

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘బాహుబలి’ సిరీస్ సృష్టించిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. ఈ ఎపిక్ యాక్షన్ మూవీ కోసం జక్కన్న అండ్ టీమ్ నాలుగేళ్లకు పైగా రాత్రింబగళ్లు శ్రమించారు. ఇక ఈ జర్నీని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మొత్తం 4 ఎపిసోడ్‌ల డాక్యుమెంటరీ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్కలతో పాటు రాజమౌళి ఫ్యామిలీ పంచుకున్న విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మొదటి రోజు క్లియర్ నెగిటివ్ టాక్:

ఈ డాక్యుమెంటరీలో రమా రాజమౌళి మాట్లాడుతూ.. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలైన మొదటి రోజు థియేటర్ల దగ్గర మిక్స్‌డ్ టాక్ కూడా రాలేదని, క్లియర్ నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పారు. రాజమౌళి గత చిత్రాలకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, బాహుబలి బడ్జెట్ చాలా పెద్దది కావడంతో ఒకేసారి అందరిలోనూ భయం పట్టుకుందని ఆనాటి కాలాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆస్తి అమ్మేయాలని రమా డెసిషన్:

"సినిమా ఫ్లాప్ అయితే ఆ స్థాయి బడ్జెట్‌ని కవర్ చేయగలిగే శక్తి మాకు లేదు. అప్పట్లో మాకు మణికొండలో ఒకే ఒక్క చిన్న సైట్ ఉండేది. ఇక అది అమ్మేసి నష్టాలు పూడ్చుదాం అని డిసైడ్ అయ్యాను. ఆ సైట్ వస్తే ఎంత వస్తుంది? బాహుబలి నష్టాల ముందు అది ఏ మూలకీ రాదనే విషయం నాకు తెలుసు. కానీ నేను చేయగలిగింది అదొక్కటే కాబట్టి అదే చేద్దామనుకున్నాను" అని రమా రాజమౌళి ఆనాటి ఎమోషనల్ సిట్యువేషన్‌ని వివరించారు.

నిర్మాతకు రాజమౌళి ఇచ్చిన ధైర్యం:

ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్రమైన టెన్షన్ పడ్డారట. రాజమౌళి కంటే ఆయనకే ఎక్కువ మెసేజ్‌లు వచ్చాయట. అప్పుడు రాజమౌళి నిర్మాత దగ్గరకు వెళ్లి.. "పార్ట్ 1 పోయినా పర్లేదు, మనం రెండో పార్ట్ తీసేటప్పుడు ఖర్చులు బాగా తగ్గించుకుని ఈ లాస్ మొత్తాన్ని కవర్ చేద్దాం" అని ధైర్యం చెప్పారట. కానీ కట్ చేస్తే.. ఆ తర్వాత బాహుబలి వరల్డ్ వైడ్‌గా ఎలాంటి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్‌ను తట్టుకుని, ఆస్తి అమ్మేసే పరిస్థితి నుంచి ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా బాహుబలి నిలవడం నిజంగా ఒక అద్భుతం. రాజమౌళి నమ్మకం, రమా రాజమౌళి సపోర్ట్, అలాగే శోభు యార్లగడ్డ పెట్టిన పెట్టుబడి వల్లే ఈరోజు తెలుగు సినిమా గర్వంగా గ్లోబల్ స్టేజ్ మీద నిలబడగలిగింది. ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాలు వింటుంటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం.