'మగధీర' సీక్వెల్ కోసం రాజమౌళి అల్లు అరవింద్‌తో కలుస్తారా?
అల్లు అరవింద్, రాజమౌళి కాంబినేషన్లో మరో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రాజమౌళి సరదాగా అల్లు అరవింద్‌ను ‘మగధీర’ తరహాలో సోలోగా ఓ సినిమా నిర్మించాలని కోరారు. దీంతో రామ్ చరణ్‌తో ‘మగధీర’ సీక్వెల్ వస్తుందనే ఆశలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఇది అభిమానుల ఆకాంక్ష మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
By: Sivaji Kontham | 28 Nov 2026 10:40 AM ISTనిర్మాత అల్లు అరవింద్- దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన `మగధీర` తెలుగు సినిమా చరిత్రలో ఒక రేర్ ఫీట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ నటించిన రెండో చిత్రంగానే బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన ఈ ప్రాజెక్ట్ కథాంశం, భారీ విజువల్స్, సంగీతం, చరణ్ నటన ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకంగా నిలిచింది. ఆ స్థాయి మ్యాజిక్‌ను మళ్లీ చూడాలనే కోరికతో `మగధీర`కు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఒక మీడియా వేదికపై అల్లు అరవింద్‌ను ఉద్దేశించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు కొత్త ఊపునిచ్చాయి. అరవింద్ గారు అవార్డు విన్నింగ్ సినిమాలు చేస్తున్నా.. అందరితో కలిసి చేస్తున్నప్పుడు యంగ్ ప్రొడ్యూసర్స్ క్రెడిట్ మొత్తం తీసుకుంటున్నారని... `మగధీర` తరహాలో సోలో ప్రొడక్షన్లో ఒక సినిమా చేయాలని రాజమౌళి సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతోనే అల్లు అరవింద్ నిర్మాతగా సోలోగా `మగధీర` సీక్వెల్ చేస్తే బాగుంటుందంటూ అభిమానుల్లో కొత్త ఆశలు- ఉత్సాహం పెరిగాయి. మగధీర తర్వాత ఆ ఇద్దరు దిగ్గజాలు మళ్లీ కలవకపోవడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ మళ్లీ కలిస్తే మిరాకిలే అంటూ గుసగుస మొదలైంది.
ట్రెండ్ ని పరిశీలిస్తే.. రాజమౌళి వ్యాఖ్యల వెనుక ఆ ఇరువురి కలయికకు ఆస్కారం ఉందా? అనే ఆసక్తి మొదలైంది. కొందరు దిగ్గజ నిర్మాతలు కలిసి పని చేస్తే ఆ ప్రొడక్ట్ క్వాలిటీ వేరే లెవల్ లో ఉంటుంది. అగ్ర నిర్మాణ సంస్థలు, యువ నిర్మాతల భాగస్వామ్యంతో ప్రాజెక్టులు ముందుకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో `మగధీర` వంటి భారీ విజయాన్ని సొంత బ్రాండ్ పట్టుతో నిలబెట్టిన అనుభవజ్ఞుడైన నిర్మాత సోలోగా ముందుకు రావాలనే భావన ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.
అయితే `మగధీర` సీక్వెల్ అనేది కేవలం నిర్మాతల నిర్ణయంపైనే కాకుండా.. రాజమౌళి- రామ్ చరణ్‌ల ప్రస్తుత ప్రాజెక్టుల షెడ్యూళ్లు... కథా చర్చలు.. ఇతర డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అభిమానుల ఆకాంక్ష మాత్రమే. అరవింద్ -రాజమౌళి మళ్లీ కలిసి రామ్ చరణ్ కోసం ఒక భారీ పాన్ వరల్డ్ సినిమాని తీయాలని అభిమానులు కలలు కంటున్నారు. ఆ ఇద్దరు దిగ్గజాల కాంబినేషన్లో మళ్లీ మగధీర లాంటి భారీ ప్రాజెక్ట్ కుదురుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
