రాజమౌళి దగ్గర అలాంటి పప్పులుడకవ్
పరిచయాలే ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తాయంటారు. దర్శక, నిర్మాతలతో ఉన్న ర్యాపో కూడా ఇక్కడ కీలకం అంటారు.
By: Srikanth Kontham | 16 Nov 2025 1:00 PM ISTపరిచయాలే ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తాయంటారు. దర్శక, నిర్మాతలతో ఉన్న ర్యాపో కూడా ఇక్కడ కీలకం అంటారు. వాళ్లతో ఆ సన్నిహిత్యం ఉంటే ఏదో సినిమాకు తీసుకునే అవకాశం ఉంటుందంటారు. వాళ్లను కాదని బయట వారికి అవకాశాలు వెళ్లడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. అప్పటికే నటులుగా గుర్తింపు ఉన్న నేపథ్యంలో ఆ పాత్రలకు వారినే తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సినిమాలో కాకపోతే మరో సినిమాలో అయినా ఆ దర్శకుడు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నోరు తెరిచి వేషం అడిగాడు..ఏదో పాత్ర ఇద్దామని కొంత మంది దర్శకులు భావిస్తుంటారు.
కానీ దర్శకధీరుడు రాజమౌళి వద్ద మాత్రం ఇలాంటి పప్పులేవి ఉడకవని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను ఏ సినిమా తీసినా? అందులో ఏ పాత్రకు ఏ నటుడు సెట్ అవుతాడో? అది పూర్తిగా ఆయన తీసుకునే నిర్ణయం మీదనే ఉంటుందని ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే రాజీవ్ కనకాల తెలిపారు. ఎవరైనా వెళ్లి వేషం అడిగితే సింపుల్ గా ఓ నవ్వు నవ్వుతారు తప్ప వేషం ఇస్తాననిగానీ, ఇవ్వననిగానీ ఏదీ చెప్పరుట. ఒక్క నవ్వుతో విషయం అర్దం చేసుకుని మనమే వెనక్కి వచ్చేయాలని చెప్పారు. అలాగే రాజమళి వద్ద రికమండీషన్లు కూడా ఎంత మాత్రం వర్కౌట్ అవ్వవు.
అతన్ని రికమండ్ చేసింది ఎలాంటి వారైనా? అదే నవ్వు వస్తుంది? తప్ప మరో సమాధానం ఉండదన్నారు. తన కథకు, పాత్రలకు ఎవరైతే సూటవుతారో? వారిని ఎంపిక చేస్తారు. వారిని ఎంత కష్టమైన వెతికి పట్టుకుంటారు తప్ప రాజీ పడరని..ఆ నటుడు దొరకలేదని మరో నటుడితో పాత్రను భర్తీ చేయడం వంటివి ఉండవన్నారు. తనది ఎంత మాత్రం రాజీ పడని మనస్తత్వం అని తెలిపారు. ఏ పాత్ర ఎలాంటి నటుడికి సూటవుతుంది? అన్నది దర్శకుడికి ఓ ఐడియా ఉంటుంది. కొన్ని పాత్రలు నటుల్ని బట్టే పుడుతుంటాయి. రాజమౌళి కూడా అలాంటి డైరెక్టరే.
నటుడి ట్యాలెంట్ , మార్కెట్ లో ఉన్న ఇమేజ్ ఆధారంగా రాజమౌళి కొన్ని పాత్రలు రాస్తుంటారు. ఏ కథకు ఎలాటి హీరో అయితే బాగుంటుందో? పక్కాగా ప్లాన్ చేసుకుని ఆ హీరోనే బరిలోకి దించుతారు. హీరో అంగీకరించలేదని అందులోకి మరో హీరోని తీసుకొచ్చి పెట్టరు. అవసరమైతే ఆ కథనే మార్చేసి మరో కొత్త కథతో ముందుకెళ్తారు. `బాహుబలి` బడ్జెట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని ముందే ఊహించి ప్రత్యామ్నాయంగా `బాక్సర్` కథను కూడా సిద్దం చేసి పెట్టారు. కానీ `బాహుబలి`కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. దిగ్విజయంగా ఆప్రాజెక్ట్ పూర్తి చేసారు. ప్రస్తుతం మహేష్ తో `వారణాసి` ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారో తెలిసిందే.
