బాహుబలి ఎపిక్.. రాజమౌళి ఫినిషింగ్ టచ్..!
10 ఏళ్లు అవుతున్నా రాజమౌళి ఇంకా బాహుబలి సినిమా పనుల్లో ఉన్నాడు. అదేంటి అంటే బాహుబలి సినిమా రెండు భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు
By: Ramesh Boddu | 4 Oct 2025 10:50 AM IST10 ఏళ్లు అవుతున్నా రాజమౌళి ఇంకా బాహుబలి సినిమా పనుల్లో ఉన్నాడు. అదేంటి అంటే బాహుబలి సినిమా రెండు భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎంపిక చేయబడిన ఐమాక్స్ ఇంకా కొన్ని స్క్రీన్స్ లో ఇది ప్రదర్శించబడుతుంది. ఐతే దీనికి సంబంధించిన పనులు దగ్గర ఉండి చూసుకుంటున్నాడు రాజమౌళి. బాహుబలి ది ఎపిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు రాజమౌళి పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాన్నే ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి ఎపిక్ కు రాజమౌళి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రాజమౌళి విజన్ ఏంటన్నది..
తెలుగు సినిమా గురించి చెప్పాలంటే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అని హిస్టరీ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా పాన్ ఇండియాని షేక్ చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది. రాజమౌళి విజన్ ఏంటన్నది తనకే కాదు ఎంతోమందిని ఒక ఐ ఓపెన్ గా మారింది. బాహుబలి వేసిన బాటలో ఇప్పుడు ఎన్నో సినిమాలు పాన్ ఇండియా హంగామా చేస్తున్నాయి. రాజమౌళి 10 ఏళ్ల క్రితం వేసిన తొలి అడుగు ఇప్పుడు ఎంతోమందికి మార్గదర్శకం అయ్యింది.
బాహుబలి 1, 2 సినిమాలు ఆల్రెడీ అందరూ చూశారు. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ సినిమాను ప్రత్యేకమైన కట్స్ తో చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని కొత్త సీన్స్ కూడా ఉంటాయని టాక్. సో ఆ ఎక్స్ పీరియన్స్ కోసం కూడా ఆడియన్స్ బాహుబలి ఎపిక్ ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఎలాగు రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాజా సాబ్ వచ్చే దాకా వెయిట్ చేయాలి కాబట్టి ఈలోగా బాహుబలి ది ఎపిక్ సినిమా చూసే అవకాశం ఉంటుంది.
మహేష్ తో పాన్ వరల్డ్ సినిమా..
బాహుబలి ది ఎపిక్ సినిమా కూడా రికార్డులు సృష్టించేలా వర్క్ జరుగుతుంది. రాజమౌళి దగ్గర ఉండి ఆ పనులు చూసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2027 రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది. నవంబర్ లో మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృధ్విరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు.
రాజమౌళి ఫినిషింగ్ టచ్ తో బాహుబలి ఎపిక్ మరో ఎపిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఉండబోతుంది. ఐతే ప్రస్తుతం మహేష్ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన జక్కన్న బాహుబలి కోసం ఇంకా పనిచేస్తుండటం సర్ ప్రైజింగ్ గా ఉంది.
