Begin typing your search above and press return to search.

జస్ట్ రాజమౌళి థింగ్స్

ఈ వారం రిలీజవుతున్న ‘మాస్ జాతర’ మీద ‘బాహుబలి’ దెబ్బ గట్టిగానే పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రీ రిలీజ్‌తోనూ ఇలాంటి ట్రెండ్ సెట్ చేయడం రాజమౌళికే చెందింది.

By:  Garuda Media   |   31 Oct 2025 8:25 PM IST
జస్ట్ రాజమౌళి థింగ్స్
X

‘బాహుబలి: ది బిగినింగ్’ ఎప్పుడో పదేళ్ల కిందట విడుదలైన సినిమా. దానికి కొనసాగింపుగా ఇంకో రెండేళ్లకు ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలైంది. ఈ రెండు చిత్రాలను చూడని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. థియేటర్లలో, టీవీలో, ఓటీటీలో ఎన్నోసార్లు ఈ చిత్రాలను చూసిన వాళ్లు కూడా ఇప్పుడు ఈ రెండు చిత్రాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేస్తే ఏదో కొత్త సినిమా విడుదలైనట్లు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.

శుక్రవారం రిలీజ్ అంటే.. విదేశాల్లో ఈ చిత్రానికి రెండు రోజుల ముందు నుంచే ప్రిమియర్స్ పడ్డాయి. ప్రపంచంలోనే ది బెస్ట్ అనదగ్గ స్క్రీన్లలో ఈ సినిమాకు స్క్రీన్లు కేటాయించారు. బెస్ట్ విజువల్ క్వాలిటీ, సౌండ్ ఉన్న థియేటర్లలో ‘బాహుబలి: ది ఎపిక్’ను ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘బాహుబలి: ది ఎపిక్’కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

ఈ వారం రిలీజవుతున్న ‘మాస్ జాతర’ మీద ‘బాహుబలి’ దెబ్బ గట్టిగానే పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రీ రిలీజ్‌తోనూ ఇలాంటి ట్రెండ్ సెట్ చేయడం రాజమౌళికే చెందింది.

ఇప్పటిదాకా ఉన్న రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ‘బాహుబలి: ది ఎపిక్’ బద్దలు కొట్టడమే కాదు.. భవిష్యత్తులో మరే సినిమా దీన్ని దాటలేని స్థాయికి వసూళ్లను తీసుకెళ్లబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇవన్నీ ఒకెత్తయితే.. రాజమౌళి అండ్ టీం కొత్త సినిమా తరహాలో దీన్ని ప్రమోట్ చేయడం.. మీడియా వాళ్ల కోసం ‘బాహుబలి: ది ఎపిక్’ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం.. చూసిన వాళ్లు ప్రత్యేకంగా రివ్యూలు కూడా రాయడం.. ఇవన్నీ కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే. ఇవన్నీ జస్ట్ రాజమౌళి థింగ్స్ అంటూ ఆయన్ని మరోసారి అందరూ కొనియాడుతున్నారు.