'ధురంధర్ 2'పై జక్కన్న టెర్రిఫిక్ ఎనాలిసిస్!
ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి సగటు సినీ లవర్, ప్రముఖు ప్రశంసల్ని సొంతం చేసుకుంటున్న మూవీ `ధురంధర్ ది రివేంజ్`.
By: Ravindar Gorantla | 21 March 2026 10:48 AM ISTప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి సగటు సినీ లవర్, ప్రముఖు ప్రశంసల్ని సొంతం చేసుకుంటున్న మూవీ `ధురంధర్ ది రివేంజ్`. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన మూవీ ఇది. ఫస్ట్ పార్ట్ `ధురంధర్` బ్లాక్ బస్టర్ హిట్ కావడం, ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త చర్చకు తెరలేపడంతో సీక్వెల్ `ధురంధర్ ది రివేంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. భారీ అంచనాల నేపథ్యంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద లిట్రల్లీ ర్యాంపేజ్ చేస్తోంది.
మార్చి 19న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖులు, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాదికి చెందిన సినీ సెలబ్రిటీలు భరీ స్థాయిలో స్పందిస్తూ టీమ్‌పై హీరో రణ్‌వీర్ సింగ్‌పై, దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్.. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాల ప్రవాహానికి ఆద్యుడుగా నిలిచిన రాజమౌళి `ధురంధర్ ది రివేంజ్`పై ప్రశంసలు కురిపిస్తూనే టెర్రిఫిక్ ఎనాలసిస్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
జక్కన్న దనదైన స్టైల్లో సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆసక్తికరంగా స్పందించారు. తనకు ధురంధర్ 1 బాగా నచ్చింది అంటూనే `ధురంధర్ ది రివేంజ్`పై ఓ రేంజ్‌లో ప్రశంసలు కురిపించారు. `నాకు ధురంధర్ 1 బాగా నచ్చింది. కానీ ది రివేంజ్ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు సినిమాని మించిపోయింది. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ఆ ప్రపంచాన్ని పునఃసృష్టించిన తీరు, డైరెక్షన్ ఇలా అన్ని ఎలాంటి తడబాటు లేకుండా దోషరహితంగా ఉన్నాయి.
కానీ ఇందులోని భావోద్వేగభరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన బలాన్నిచ్చాయి. రచన, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠతను సృష్టించేలా కథలో మలుపులను అద్భుతంగా అల్లింది. ఆదిత్యధర్ మీరు అదరగొట్టారు.4 గంటల నిడివి ఉన్న సినిమానుతీసి విడుదల చేయడానికి ధైర్యం కావాలి. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుతున్నారు. రణ్‌వీర్ సింగ్ మీది అద్భుతమైన నటన మిత్రమా.
షెడ్యులో సోదరితో ఉన్న సన్నివేశం నటనలో ఓ మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుంచి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు హమ్జా అండ్ జస్కిరత్ గా మీరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. మాధవన్ గారు మీరు దేశం యొక్క నిస్సహాయతను , నిరాశను ఎంత అద్భుతంగా ప్రదర్శించారంటే మీ విజయాన్ని మా విజయంగా భావించాము. ఇంతటి ఘనవిజయానికి చిత్ర బృందానికి అభినందనలు` అంటూ జక్కన్న `ధురంధర్ ది రివేంజ్` టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా జక్కన్న సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, భావోద్వేగాలని, ప్రధాన ఆర్టిస్ట్‌ల నటన, దర్శకుడి ప్రభని ప్రశంశిస్తూ ధురంధర్ ది రివేంజ్‌పై ఇచ్చిన టెర్పిఫిక్ ఎనాలిసిస్ అందరినీ ఆకట్టుకుంటోంది. దక్షిణాది సెలబ్రిటీలు ఈ స్థాయిలో `ధురంధర్ ది రివేంజ్`పై ప్రశంసలు కురిపిస్తున్నా ఉత్తరాదికి చెందిర స్టార్స్..ముంబై బ్యాచ్ మన స్థాయిలో స్పందించకపోవడం శోచనీయం.
