రాజమౌళి తదుపరి హీరో బన్నీ!
దర్శక శిఖరం రాజమౌళి ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లను డైరెక్ట్ చేసారు. జక్కన్న కారణగానే ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు.
By: Srikanth Kontham | 21 Sept 2025 5:26 PM ISTదర్శక శిఖరం రాజమౌళి ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లను డైరెక్ట్ చేసారు. జక్కన్న కారణగానే ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. ప్రస్తుతం మహేష్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ని ఏకంగా గ్లోబల్ స్థాయిలోనే లాంచ్ చేస్తున్నారు. పాన్ ఇండియాకే పాన్ వరల్డనే షేక్ చేద్దామని మహేష్ తో కలిసి బయల్దేరారు. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. హిట్ అయితే తెలుగు సినిమా ప్రపంచాన్ఏ ఏల్తుందని ఓ సంకేతాన్ని పంపిచినట్లే. రాజమౌళి ప్లాన్ కూడా అదే. 120 దేశాల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారంటే? జక్కన్న స్ట్రాటజీ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
ఆ హీరో అదృష్టవంతుడే:
ఈ సినిమా తర్వాత రాజమౌళి స్థాయి ప్రపంచానికే చేరుతుంది. మరి ఆ తర్వాత రాజమౌళి హీరో ఎవరు? అవుతారు? అన్నది ఓ పెద్ద సస్పెన్స్. అవును ఆ తర్వాత రాజమౌళి ఏ హీరోని డైరెక్ట్ చేసినా? అంతకు మించిన అదృష్టం ఆ హీరోకి ఏముంటుంది? మరి ఆ ఛాన్స్ టాలీవుడ్లో ఏ హీరోకి వుంది అంటే? ఐకాన్ స్టార్లు అల్లు అర్జున్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే బన్నీ `పుష్ప` తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కొత్తగా ఆయన మళ్లీ పాన్ ఇండియా మార్కెట్ కోసం పాకులాడాల్సిన పనిలేదు. ప్రస్తుతం అట్లీతో గ్లోబల్ స్థాయిలోనే ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
బన్నీ అభిమానుల కోరిక సైతం:
అట్లీ మార్క్ కంటెంట్ ఉన్నా? టెక్నికల్ గా అంతర్జాతీయ మార్కెట్ కి ఈ చిత్రాన్ని కనెక్ట్ చేస్తూ తీస్తున్నారు. సక్సెస్ అయితే బన్నీ పాన్ వరల్డ్ స్టార్ అవుతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. `పుష్ప` పాటల్ని పెద్ద పెద్ద క్రికెటర్లే రీల్స్ చేయడంతో బన్నీ పేరు అంతర్జాతీయంగానూ మారు మ్రోగింది. ఆ రేంజ్ ఉన్న నుటుడుకి జక్కన్న తోడైతే ఎలా ఉంటుంది? అద్భుతమే కదా. బన్నీ అభిమానులు కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో రాజమౌళి-బన్నీ సరిగ్గా బ్యాలెన్స్ అవుతారు.
స్టార్ రైటర్ రంగంలోకి దిగితేనే:
మరి రాజమౌళి మైండ్ లో ఏముందో? వీరిద్దరు అనుకున్నా సరిపోదు. ఆ కాంబినేషన్ లో సినిమా సాధ్య మవ్వాలం టే? వీళ్లకంటే ముందుగా స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సంకల్పిచాలి. ఆయన బన్నీకి ఇమేజ్ కు తగ్గ స్టోరీ రా యాలి. అప్పుడే ఎన్ని అనుకున్నా జరుగుతుంది. ఆయన స్టోరీ లేకుండా రాజమౌళి ముందుకొచ్చినా పనవ్వదు అన్నది అంతే వాస్తవం. ప్రస్తుతం రాజమౌళి-బన్నీ వేర్వేరు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
