Begin typing your search above and press return to search.

మహేశ్ ని చూసి మారాలనిపించే మూమెంట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్న క్రేజే వేరు. హీరోగా ఇండస్ట్రీలో బిగ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఆయన.. తండ్రి దివంగత కృష్ణకు తగ్గ తనయుడుగా అనిపించుకున్నారు.

By:  M Prashanth   |   16 Nov 2025 11:32 AM IST
మహేశ్ ని చూసి మారాలనిపించే మూమెంట్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్న క్రేజే వేరు. హీరోగా ఇండస్ట్రీలో బిగ్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఆయన.. తండ్రి దివంగత కృష్ణకు తగ్గ తనయుడుగా అనిపించుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుని సత్తా చాటారు. ఇప్పుడు బిగ్గెస్ట్ వారణాసితో మూవీతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఆ సినిమా డైరెక్టర్, దర్శకధీరుడు రాజమౌళి.. రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. నిన్న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి మూవీ ఈవెంట్ జరగ్గా.. మహేష్ బాబును ఉద్దేశించి జక్కన్న మాట్లాడారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. సూపర్ స్టార్ బెస్ట్ థింగ్ ను షేర్ చేసుకున్నారు.

మహేష్ బాబు నుంచి నేర్చుకునే లక్షణం ఒకటి ఉందని తెలిపిన రాజమౌళి.. తాను కూడా అది నేర్చుకుంటానని చెప్పారు. కచ్చితంగా నేర్చుకోవాలని అన్నారు. అందరూ కూడా ఫాలో అయితే బాగుంటుందని తెలిపారు. అదేంటంటే.. మొబైల్ కు దూరంగా ఉండటం. ప్రస్తుత రోజుల్లో అది ఎవరికైనా ఎంత కష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సెల్ ఫోన్ లేకుంటే కాసేపు కూడా ఉండలేకపోతున్న ఈ రోజుల్లో.. మహేష్ మాత్రం మొబైల్ ను చాలా తక్కువగా యూజ్ చేస్తారట. అంతే కాదు షూటింగ్ కు వస్తే అసలు ఫోన్ చూడరని రాజమౌళి వెల్లడించారు. ఏకంగా దాన్ని తన కారులో విడిచి పెట్టి వస్తారని చెప్పారు. 7-8 గంటలు అయినా కూడా ఫోన్ జోలికి వెళ్లరని చెప్పారు.

దీంతో రాజమౌళి చెప్పిన విషయం వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. గ్రేట్ మహేష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలా చేయడం మామూలు విషయం కాదని అంటున్నారు. చాలా తక్కువ మందికి మాత్రమే అది సాధ్యం అని చెబుతున్నారు. కాన్సట్రెంటేషన్ అంటే అలా ఉండాలని అంటున్నారు.

అదే ఈవెంట్ లో మహేష్ కు రాముడిగా గెటప్‌ వేసి వారణాసి షూటింగ్ కు ఫొటో షూట్‌ చేశామని రాజమౌళి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నివేశాలను మొత్తం 60 రోజులపాటు షూట్‌ చేశామని చెప్పారు. ఆ సమయంలో ఆయన ఫొటోను తన సెల్ ఫోన్‌ వాల్‌ పేపర్ గా పెట్టుకున్నానని, కానీ ఎవరైనా చూసి లీక్‌ చేస్తారని తీసేశానని వెల్లడించారు. ఏదేమైనా మహేష్ బాబు నటన అద్భుతమంటూ కొనియాడారు.