'రాజా ది రాజా' ట్రైలర్.. ఏదో కొత్తగా ఉందే..
తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత హైప్ పెంచింది. జులై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ.. ట్రైలర్ తోనే ఏదో కొత్తగా ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది.
By: M Prashanth | 6 July 2026 7:20 PM ISTచిన్న సినిమాల్లో కొత్తదనం కనిపిస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఆసక్తి రేకెత్తిస్తోంది రాజా ది రాజా సినిమా ట్రైలర్. రుత్విక్, విశాఖ ధీమన్ లీడ్ రోల్స్ లో నటించిన ఆ మూవీకి అనిల్ బోయిడపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఫుల్ లవ్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకున్న ఆ సినిమాపై.. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత హైప్ పెంచింది. జులై 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ మూవీ.. ట్రైలర్ తోనే ఏదో కొత్తగా ఉందనే ఫీలింగ్ కలిగిస్తోంది.
ట్రైలర్ ను చూస్తుంటే.. రాజా ది రాజా ఇది సాధారణ ప్రేమకథ కాదనే విషయం స్పష్టమవుతోంది. ఒకవైపు రాజు, యువరాణి నేపథ్యంలో సాగే అప్పటి ప్రపంచం.. మరోవైపు ఇప్పటి రోజుల్లో ఫ్యాషన్ డిజైనర్ గా ఎదగాలని కలలు కనే యువకుడి జర్నీ.. రెండు కాలాలను దర్శకుడు ఒకే కథలో మిక్స్ చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. రెండింటినీ కలిపే మెయిన్ ఎలిమెంట్ గా గోల్డెన్ కాయిన్ ను చూపించడం కథలోని మిస్టరీపై ఆసక్తిని పెంచుతోంది.
రుత్విక్ కు ఇది కీలక చిత్రం కానుంది. ట్రైలర్ లో ఆయన రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించారు. రాజకుమారుడిగా గంభీరంగా కనిపించడమే కాకుండా, నేటి యువకుడి పాత్రలో ఫుల్ జోష్ లో, నేచురల్ గా నటించిన తీరు ఆకట్టుకుంటోంది. రెండు విభిన్న పాత్రలకు తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ లో ఛేంజ్ చూపించే ప్రయత్నం కనిపిస్తోంది. విశాఖ ధీమన్ కూడా రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించారు.
యువరాణి పాత్రలో సంప్రదాయ అందాన్ని, మోడ్రన్ గర్ల్ గా గ్లామర్ తో ఆకట్టుకున్నట్లు ట్రైలర్ లో చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా నేచురల్ గా కనిపిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయికుమార్ రాజు పాత్రలో కనిపించడం ట్రైలర్ కు మరో స్పెషల్ అట్రాక్షన్. ఆయన రోల్ కథను మలుపు తిప్పేలా ఉండొచ్చని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ప్రేమ, మిస్టరీ అంశాలు ప్యారలల్ గా మిక్స్ చేసినట్లు అర్థమవుతోంది.
టెక్నికల్ గా కూడా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అప్పటి రోజులను రిఫ్లెక్ట్ చేసేలా విజువల్స్, మోడ్రన్ జెనరేషన్ లో కలర్ ఫుల్ వరల్డ్ ను చూపించిన కెమెరా వర్క్ ఆకట్టుకుంటోంది. ప్రొడక్షన్ వాల్యూస్ ను కూడా సినిమా రేంజ్ ను పెంచేలా కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథలోని ఆసక్తి మరింత పెంచేలా ఉంది. ఏదేమైనా రాజా ది రాజా ట్రైలర్ రెగ్యులర్ లవ్ స్టోరీని భిన్నమైన ఎక్స్పీరియన్స్ కలిగిస్తోంది.
రెండు కాలాల మధ్య నడిచే కథ, మిస్టరీ, కొత్త తరహా స్టోరీ, యూత్ ను ఆకట్టుకునే ప్రేమకథ.. ఇవన్నీ కలిసి సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో రెండు కాలాల మధ్య అసలు సంబంధం ఏమిటి?, గోల్డెన్ కాయిన్ వెనుక రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ క్వశ్చన్లకు దర్శకుడు జులై 17న థియేటర్లలో ఎలాంటి ఆన్సర్ చెబుతారో చూడాలి.
